Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2023 టోర్నీకి నిరసన సెగ.. మూడో రౌండ్లో స్వైటెక్‌, జకోవిచ్!

లండన్: వింబుల్డన్ 2023 టోర్నీకి కూడా నిరసన సెగ తగిలింది. ఇంగ్లండ్ వేదికగానే జరుగుతున్న యాషెస్ సిరీస్‌‌కు ఆటంకం కలిగించిన పర్యావరణ ఉద్యమకారులు.. బుధవారం వింబుల్డన్‌లో రెండు మ్యాచ్‌లు అడ్డుకున్నారు. అనూహ్యంగా కోర్టులోకి దూసుకెళ్లి రంగు కాగితాలను వెదజల్లారు.

మొదట దిమిత్రోవ్‌, షిమబుకురో మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన ఉద్యమకారులు.. ఆ తర్వాత బౌల్టర్‌, సవిలె మ్యాచ్‌ను కూడా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వింబుల్డన్‌ నిర్వాహకులు తెలిపారు. వర్షం కారణంగా బుధవారం చాలా మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.

Wimbledon 2023: Djokovic, Swiatek reach third round on rain-affected day

ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ తొలి రోజు ఆటలోకి ఆందోళనకారులు దూసుకొచ్చి రంగులు వెదజల్లిన విషయం తెలిసిందే.

బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో మహిళల టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన రెండో రౌండ్లో స్వైటెక్ 6-2, 6-0తో సారిబెస్‌ టొర్మో (స్పెయిన్‌)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో ఓడిన ఎనిమిదో సీడ్‌ సకారి (గ్రీస్‌) టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్‌లోనే కోస్త్యుక్‌ (ఉక్రెయిన్‌) 0-6, 7-5, 6-2తో సకారికి షాకిచ్చింది.

11వ సీడ్‌ కసట్కినా (రష్యా) 6-0, 6-2తో బురేజ్‌ (బ్రిటన్‌)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో వెకిచ్‌ (క్రొయేషియా) 6-2, 6-3తో జాంగ్‌ (చైనా)పై, గ్రచేవా (ఫ్రాన్స్‌) 6-2, 6-4తో జియోర్జి (ఇటలీ)పై, కొంటావీట్‌ (ఎస్తోనియా) 6-4, 6-4తో స్టెఫానీ (ఇటలీ)పై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ జకోవిచ్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో జకోవిచ్‌ (సెర్బియా) 6-3, 7-6 (7-4), 7-5తో థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.

మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో అతడు 7-5, 6-4, 6-3తో ఫెరీ (బ్రిటన్‌)ను మట్టికరిపించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఫ్రిట్జ్‌ 6-4, 2-6, 4-6, 7-5, 6-3తో హన్ఫ్‌మ్యాన్‌ (జర్మనీ)పై నెగ్గగా.. తియోఫో 7-6 (7-4), 6-3, 6-4తో యిబింగ్‌ వు (చైనా)ను ఓడించాడు.

దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-1, 6-2, 6-1తో షిబాబుకురో (జపాన్‌)పై, రోనిచ్‌ (కెనడా) 6-7 (5-7), 6-4, 7-6 (7-5), 6-1తో నొవాక్‌ (ఆస్ట్రియా)పై, ముల్లర్‌ (ఫ్రాన్స్‌) 7-6 (7-5), 1-6, 6-3, 6-4తో రిండర్‌నెచ్‌ (ఫ్రాన్స్‌)పై, పెలా (అర్జెంటీనా) 6-3, 7-5, 4-6, 3-6, 6-1తో కోరిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించారు.

Story first published: Thursday, July 6, 2023, 10:40 [IST]
Other articles published on Jul 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+