For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2023: వింబుల్డన్ కోటలో కొత్త రాజు.. జకోవిచ్‌‌ను ఓడించిన అల్కరాజ్!

వింబుల్డన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీకి కొత్త రాజు వచ్చాడు. పురుషుల సింగిల్స్ భవిష్యత్తు తనదే అని చాటి చెబుతూ వరల్డ్ నెంబర్ వన్, స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ కెరీర్‌లో రెండో టైటిల్ అందుకున్నాడు. ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌తో స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ రికార్డు సమం చేయాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు 20 ఏళ్ల అల్కరాజ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు.

తన వయసంత అనుభవం.. 23 గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన చరిత్ర.. వరుసగా ఐదు వింబుల్డన్ టైటిల్స్ గెలవడంతో పాటు సెంట్రల్ కోర్టులో 45 విజయాలతో జోరు మీదున్న జకోవిచ్‌కు అల్కరాజ్ వెరవలేదు. తొలి సెట్‌లో ఓడినా బెదరలేదు. నంబర్ వన్ ర్యాంక్ హోదాకు న్యాయం చేసిన ఈ స్పెయిన్ కుర్రోడు ఖతర్నాక్ ఆటతో ఆకట్టుకున్నాడు.

Wimbledon 2023: Carlos Alcaraz beats Novak Djokovic in five-set thriller, wins maiden title

అద్బుతమైన సర్వీస్‌లు, కళ్లు చెదిరే రిటర్న్‌లు.. విస్మయం కలిగించే విన్నర్లతో 36 ఏళ్ల జకోవిచ్‌ను మట్టికరిపించాడు. ఆదివారం 4 గంటల 41 నిమిషాల పాటు సాగిన ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌‌లో గెలిచి వింబుల్డన్‌లో కొత్త రాజుగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ పోరులో ఈ టాప్‌సీడ్‌ అల్కరాజ్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్‌ జకోవిచ్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్‌ ఓడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న అల్కరాజ్ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం 34 నిమిషాల్లోనే ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి తొలి సెట్‌ ముగించిన జకోవిచ్‌ ముందు అల్కరాజ్ తేలిపోయేలా కనిపించాడు. ఈ సెట్‌ మూడో గేమ్‌లో నెట్‌ దగ్గర నుంచి వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ల మధ్యలో నుంచి అల్కరాజ్ ఆడిన షాట్‌ ఈ ఫైనల్ పోరుకే హైలైట్‌గా నిలిచింది.

రెండో సెట్‌ నుంచి మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అల్కరాజ్ పుంజుకోవడంతో ఈ పోరు అసలైన టెన్నిస్‌ మజాను అందించింది. రెండు, మూడు సెట్లను అల్కరాజ్ గెలుచుకోగా.. కీలక నాలుగో సెట్‌ను జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. దాంతో చివరి సెట్ నిర్ణయాత్మకంగా మారింది.
ఈ సెట్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానులను ఊపేసింది.

Wimbledon 2023: Carlos Alcaraz beats Novak Djokovic in five-set thriller, wins maiden title

ప్రతి పాయింట్‌కు, ప్రతి గేమ్‌కు ఈక్వెషన్ మారింది. పాయింట్‌ పోతే ప్రాణం పోతుందన్నట్లు ఆటగాళ్లిద్దరూ తలపడ్డారు. తొలి గేమ్‌లో జకో, రెండో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ నిలబెట్టుకున్నారు. కానీ మూడో గేమ్‌లో జకో సర్వీస్‌ను అల్కరాజ్ బ్రేక్‌ చేయడమే ఈ మ్యాచ్‌లో కీలక మలుపు. ఆపై తన సర్వీస్‌ నిలబెట్టుకున్న అల్కరాస్‌ 3-1తో ఆధిక్యం సాధించాడు. ఆ సమయంలో కోపం పట్టలేక జకో రాకెట్‌ను విరగ్గొట్టాడు.

అయితే గేమ్‌లో గెలిచి జకో 2-3తో నిలిచినప్పటికీ.. వెంటనే గేమ్‌ నెగ్గి అల్కరాజ్ 4-2తో విజయం దిశగా సాగాడు. ఈ దశలో జకోవిచ్‌ గేమ్‌ బ్రేక్‌ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అల్కరాజ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన సర్వీస్‌లు నిలబెట్టుకున్నాడు. ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ గెలవగానే ఆనందంతో అల్కరాజ్ కోర్టులో పడిపోయాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 9 ఏస్‌లు, 66 విన్నర్లు కొట్టాడు.

Story first published: Monday, July 17, 2023, 7:38 [IST]
Other articles published on Jul 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+