For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2022 ఎంట్రీ లిస్ట్‌లో కనిపించని సెరెనా, వీనస్ విలియమ్స్, ఫెదరర్!

 Wimbledon 2022: Serena, Venus Williams and Roger Federer not on Wimbledon entry lists

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఎంట్రీ లిస్ట్‌లో అమెరికా మహిళా టెన్నిస్ స్టార్లు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ పేర్లు లేవు. తాజాగా వింబుల్డన్ నిర్వాహకులు విడుదల చేసిన ఈ జాబితాలో విలియమ్స్ సిస్టర్స్‌తో పాటు 20 సింగిల్స్ టైటిల్ విజేత, స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ పేరు కూడా లేదు. అయితే వీళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగే అవకాశం ఉంది. జూన్ 27 నుంచి జూలై 10 వరకు ఈ టోర్నీ జరగనుంది.

23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత అయిన సెరెనా విలియమ్స్‌ ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా బరిలోకి దిగలేదు. తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సెరెనా ఈ రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీలకు దూరంగా ఉంది.
40 ఏళ్ల సెరెనా గాయంతో గతేడాది జరిగిన వింబుల్డన్‌లో తొలి రౌండ్‌ మధ్యలోనే వైదొలిగింది.

ఆ తర్వాత సెరెనా ఆ తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. 2018, 2019 వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సెరెనా.. కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 7 వింబుల్డన్ టైటిల్స్ గెలిచింది. ఈ ఘనతను అందుకున్న తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచింది. ఐదు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన వీనస్.. గతేడాది చికాగోలో చివరిసారిగా ఆడింది. కెరీర్‌లో మొత్తం ఏడు సింగిల్స్ టైటిల్ గెలిచిన వీనస్ విలియమ్స్ మరో రెండు వారల్లో 42వ జన్మదినం జరుపుకోనుంది.

Story first published: Saturday, June 4, 2022, 18:15 [IST]
Other articles published on Jun 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+