Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2022: సానియా జోడీ సంచలనం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన హైదరాబాద్ స్టార్!

Wimbledon 2022: Sania Mirza and Mate Pavic enter mixed doubles semifinals

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సంచలన విజయాన్నందుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్‌ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డాబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై గెలుపొందింది.

గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఇక రెండో రౌండ్‌లో డోడిగ్‌ (క్రొయేషియా)-లటీషా చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ నుంచి సానియా-పావిచ్‌ (క్రొయేషి యా) జంటకు వాకోవర్‌లభించిన విషయం తెలిసిందే.

వరుసగా నాలుగోసారి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించే దిశగా టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-2, 4-6, 6-1, 6-2తో టిమ్‌ వాన్‌ రితోవెన్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు.

ఆరుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్‌ నిక్‌ కిరియోస్‌ 4-6, 6-4, 7-6 (7/2), 3-6, 6-2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6-3, 6-1, 6-4తో కుబ్లెర్‌ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ) 2-6, 5-7, 7-6 (7/3), 6-4, 7-6 (10-6)తో డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందారు.

మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), మూడో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్‌), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్‌ (ఆస్ట్రేలి యా) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.

Story first published: Tuesday, July 5, 2022, 8:13 [IST]
Other articles published on Jul 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+