For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021: జొకోవిచ్‌‌ను ఊరిస్తున్న 52 ఏళ్ల అరుదైన ఘనత!

 Wimbledon 2021: Novak Djokovic takes yet another step toward calendar-year and Golden Grand Slam

లండన్: అనుకున్నదే జరిగింది.. అంచనాలే నిజమయ్యాయి. వరల్డ్ నంబర్ వన్ హోదాకు తగ్గట్టుగా, డిఫెండింగ్ చాంపియన్ స్థాయిని నిలబెట్టుకుంటూ.. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. ఆరోసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాడు.

17 కోట్ల ప్రైజ్ మనీ..

17 కోట్ల ప్రైజ్ మనీ..

3 గంటల 24 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్‌ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు. కెరీర్‌లో 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన జోకో ఆరంభంలో తడబడ్డాడు. కానీ ప్రత్యర్థి అనుభవలేమిని లక్ష్యంగా చేసుకొని ఆధిపత్యం చెలాయించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్‌ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఊరిస్తున్న క్యాలండర్, గోల్డెన్ గ్రాండ్ స్లామ్..

ఊరిస్తున్న క్యాలండర్, గోల్డెన్ గ్రాండ్ స్లామ్..

ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌-20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్‌ సెప్టెంబర్‌లలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్‌ లేవర్‌ (1969లో) తర్వాత 'క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌' ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. యూఎస్ ఓపెన్‌కు ముందు జరిగే ఒలింపిక్స్‌లోనూ బంగారు పతకం సాధిస్తే జోకో గోల్డెన్ స్లామ్ సొంతం చేసుకోనున్నాడు. నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిస్తే గోల్డెన్ గ్రాండ్ స్లామ్ ఘనత దక్కుతుంది. టెన్నిస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ గోల్డెన్ గ్రాండ్ స్లామ్ అందుకోలేదు.

జొకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌

జొకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021

ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2): 2016, 2021

వింబుల్డన్‌ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021

యూఎస్‌ ఓపెన్‌ (3): 2011, 2015, 2018

Story first published: Monday, July 12, 2021, 10:00 [IST]
Other articles published on Jul 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+