Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2021: నేటి నుంచే టెన్నిస్ సంగ్రామం షురూ.. రికార్డు గ్రాండ్ స్లామ్‌పై జొకోవిచ్ గురి!

Wimbledon 2021: Novak Djokovic has eyes on major mark, Golden Slam

లండన్: వరల్డ్ నంబర్ వన్, సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ మరో రికార్డుపై కన్నేశాడు. అసాధారణ పోరాటంతో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జొకో.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌పై గురిపెట్టాడు. నేటి( సోమవారం) నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచి 20వ గ్రాండ్ స్లామ్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. తద్వారా మెన్స్ సింగిల్స్‌లో హయ్యెస్ట్ గ్రాండ్ స్లామ్(20) నెగ్గిన ప్లేయర్‌గా స్విస్ గ్రేట్, రోజర్ ఫెడరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డును సమం చేయాలని చూస్తున్నాడు.

రికార్డులపై గురి..

రికార్డులపై గురి..

సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, గతేడాది కరోనా కారణంగా ఈ మెగా టోర్నీ రద్దవ్వగా.. ఈసారి ఫ్యాన్స్ సమక్షంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గిన జొకో.. అదే ఊపుతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. డిఫెండింగ్ చాంప్ నొవాక్ వింబుల్డన్‌లో ఆరోసారి విజేతగా నిలవడంతో పాటు ఫెడెక్స్, రఫా సరసన నిలవాలని భావిస్తున్నాడు. అదే టైమ్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 4 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మూడో ప్లేయర్‌గా నిలిచేందుకు మర ముందడుగు వేయాలని చూస్తున్నాడు.

నాదల్ దూరం..

నాదల్ దూరం..

ఇప్పటిదాకా డాన్ బుడ్జ్(1937), రోడ్ లావెర్(1962, 1969) మాత్రమే ఈ ఘనత సాధించారు. మరోవైపు స్వీట్జర్లాండ్ గ్రేట్ ఫెడరర్ ఈ మెగా టోర్నీలో తొమ్మిదో టైటిల్‌పై కన్నేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఓడిన రెండో ర్యాంకర్ నాదల్ ఈ టోర్నీకి దూరంగా ఉండగా.. డానిల్ మెద్వెదెవ్(రష్యా), ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్టెఫనోస్ సిట్సిపాస్(గ్రీస్), అలెగ్జాండర్ జ్వెరెవ్( జర్మనీ) కూడా టైటిల్‌పై కన్నేశారు.

సెరెనా ఈ సారైనా..?

సెరెనా ఈ సారైనా..?

ఇక, మహిళల సింగిల్స్‌లో అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్‌పై అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీలో నెగ్గి మార్గరేట్ కోర్ట్ పేరిట ఉన్న మోస్ట్ గ్రాండ్ స్లామ్స్ టైటిళ్ల రికార్డు(24)ను సమం చేయాలని ఆశిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ గాయం కారణంగా ఈసారి బరిలోకి దిగడం లేదు. ఇక, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెయిలైన ఆస్ట్రేలియా స్టార్, టాప్ సీడ్ ఆష్లే బార్టీతో పాటు సబలెంకా, స్వియాటెక్, సోఫియా కెనిన్, కరోలినా ప్రిస్కోవా టైటిల్ రేసులో ఉన్నారు.

Story first published: Monday, June 28, 2021, 8:11 [IST]
Other articles published on Jun 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+