For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021 Day 5: జొకో జోరు.. ముగరుజా ఔట్.. సానియా సంచలనం!

Wimbledon 2021 Day 5: Novak Djokovic beats qualifier Denis Kudla, Garbine Muguruza knocked out

లండన్‌ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడెడ్ ఆటగాళ్ల పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మాజీ చాంపియన్‌ 11వ సీడ్‌ గార్బిన్‌ ముగురుజాకు మూడోరౌండ్‌లో చుక్కెదురైంది. అలాగే పురుషుల్లో తొమ్మిదో సీడ్‌ డీగో ష్వార్జ్‌మన్‌ కూడా కంగుతిన్నాడు. టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ దూసుకుపోతుండగా మహిళల్లో ఇతర సీడెడ్‌లు సబలెంకా, స్వియటెక్‌, ప్లిస్కోవా, పురుషుల్లో ఐదోసీడ్‌ రుబ్లేవ్‌, ఎనిమిదో సీడ్‌ అగట్‌ కూడా ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత ద్వయం సానియా మీర్జా- రోహన్‌ బోపన్న జోడీ శుభారంభం చేసింది.

ముగురుజా అవుట్‌

ముగురుజా అవుట్‌

మహిళల సింగిల్స్‌లో 2017 వింబుల్డన్‌ చాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌)కు చుక్కెదురైంది. మూడో రౌండ్‌లో ముగురుజా 7-5, 3-6, 2-6తో ఓన్స్‌ జేబుర్‌ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్‌ అరీనా సబలెంక (బెలారస్‌), ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), ఎనిమిదో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ పోరులో ఏడో సీడ్‌ స్వియాటెక్‌ 6-1, 6-0తో ఇరినా బెగు (బెల్జియం)ను చిత్తు చేసింది. ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా 6-3, 6-3తో మార్టికోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. సంసోనవా 6-2, 2-6, 6-4తో అమెరికా కెరటం స్లోన్‌ స్టీఫెన్స్‌ను ఓడించగా, రెబకీనా 6-1, 6-4తో రోజర్స్‌ (అమెరికా)పై, సబలెంక 6-0, 6-3తో ఒసోరియో (కొలంబియా)పై, గోల్‌బిక్‌ 6-2, 6-1తో బ్రింగెల్‌ (అమెరికా)పై నెగ్గారు.

 సానియా-బోపన్న జోడీ విజయం..

సానియా-బోపన్న జోడీ విజయం..

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో భారత ద్వయం సానియా మీర్జా- రోహన్‌ బోపన్న 6-2, 7-6 (7/5)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌-అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్‌లో ప్రవేశించింది. దివిజ్‌ శరణ్‌-సమంత శరణ్‌ (ఇంగ్లండ్‌) జోడీ 6-3, 5-7, 6-4 అరియల్‌ బెహెర్‌ (ఇజ్రాయెల్‌)-కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్‌) జంటపై నెగ్గింది.

జోకో జోరు..

జోకో జోరు..

ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్‌ సెర్బియన్‌ స్టార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్‌ 6-4, 6-3, 7-6 (9/7)తో డెనిస్‌ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లను జొకోవిచ్‌ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం క్వాలిఫయర్‌ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

ఈ సెట్‌లో తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకున్న కుడ్లా 3-0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్‌ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి... అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్‌ 'టై బ్రేక్‌'కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్‌ ఒక దశలో 1-4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్‌ను 4-4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో 'టై బ్రేక్‌'ను గెలిచిన జొకోవిచ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

 ముగిసిన టియాఫె పోరాటం

ముగిసిన టియాఫె పోరాటం

తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్‌ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో టియాఫె 3-6, 4-6, 4-6తో కరెన్‌ కచనోవ్‌ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్‌ డియాగో స్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)కు మూడో రౌండ్‌లో ఊహించని షాక్‌ తగిలింది. అతను 3-6, 3-6, 7-6 (8/6), 4-6తో అన్‌సీడెడ్‌ ఆటగాడు మార్టోన్‌ ఫుక్సోవిక్స్‌ (హంగేరి) చేతిలో ఓడాడు.

Story first published: Saturday, July 3, 2021, 8:49 [IST]
Other articles published on Jul 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+