Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2021: కోవిషీల్డ్ రూపొందించిన శాస్త్రవేత్తకు సెల్యూట్!

Wimbledon 2021: Crowd Welcomes Scientist Who Developed Covishield Vaccine With Loud Cheer

లండన్: రెండేళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో గత సీజన్ రద్దవ్వగా.. ఈ సారి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించారు. తొలిరోజే జొకోవిచ్, ముర్రే, సిట్సిపాస్ వంటి దిగ్గజాలా మ్యాచ్‌లు ఉండటంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇక సెంటర్ కోర్టులోని రాయల్ బాక్సులో ప్రత్యేక ఆహ్వానితులు దర్శనమిచ్చారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ తమ టీమ్‌తో కలిసి టెన్నిస్ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేలా చేసిన ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలతో పాటు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) బృందానికి వింబుల్డన్ థ్యాంక్స్ చెప్పింది.

కరోనా మహహ్మారి వేళ ఎన్‌హెచ్ఎస్ సేవలు చిరస్మరణీయమని వింబుల్డన్ అనౌన్సర్ ప్రకటించారు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అంతా కరతాళధ్వనులతో నిలబడి మరీ శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డన్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అభిమానుల నుంచి వచ్చిన అనూహ్య రెస్పాన్స్‌కు రాయల్ బాక్స్‌లో కూర్చున్న ప్రొఫెసర్ గిల్బర్ట్ ఆనందంతో పరవశించిపోయారు. ముసి ముసి నవ్వులతో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలోని జెన్న‌ల్ ఇన్‌స్టిట్యూట్, స్వీడెన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ క‌లిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను భారత్, పూణేలోని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే తయారు చేస్తోంది. క‌రోనా వ్యాక్సిన్‌ను క‌నుగొనేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలోనే ఆక్స్‌ఫోర్డ్‌, సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ మ‌ధ్య ఒక ఒప్పందం జ‌రిగింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్‌గా పిలుస్తున్నారు.

ఇక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన మెడికల్ స్టాఫ్‌తో పాటు క్రిటికల్ కేర్‌, నర్సింగ్ స్టాఫ్‌, వర్కర్లకు వింబుల్డన్ థ్యాంక్స్ తెలిపింది. కరోనా వేళ భారీ విరాళం సేకరించిన కెప్టెన్ సర్ టామ్ మూర్‌ను కూడా గుర్తు చేసుకున్నారు. ఎన్‌హెచ్ఎస్ కోసం టామ్ మూర్ పిలుపుతో సుమారు 33 మిలియన్ల పౌండ్ల విరాళం వచ్చింది. వందేళ్ల ఆ వృద్ధుడు ఆ తర్వాత కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.

రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో తొలి రోజే సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌, మూడో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్ నొవాక్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ అరియానా సబలెంకా, సోఫియా కెనిన్‌, 7వ సీడ్‌ స్వియటెక్‌ రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవాకు షాక్‌ తగిలింది. వర్షం కారణంగా తొలి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 16 రద్దయ్యాయి.

Story first published: Tuesday, June 29, 2021, 13:12 [IST]
Other articles published on Jun 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+