NBA Legend Kobe Bryant death: బ్రో.. నీ జ్ఞాపకాలు మా గుండెల్లో పదిలం

హైదరాబాద్: అమెరికాలో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రయంట్ దుర్మరణం చెందడం పట్ల యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు. ఈ ప్రమాదంలో కోబ్ బ్రయంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానా కూడా దుర్మరణం చెందింది.
కోబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కోబ్ బ్రయంట్ దుర్మరణం పట్ల టెన్నిస్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. టెన్నిస్ స్టార్స్ నోవాక్ జొకోవిచ్, మారియ షరపోవా, నవోమి ఒసాకలు కొబ్ బ్రయంట్‌తో గడిపిన క్షణాలను, అతనితో ఉన్న బంధాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంటూ సంతాపం తెలిపారు. 'నీవు దూరమైన.. నీ జ్ఞాపకాలు ఎప్పుడూ మా మదిలో ఉంటాయ్ బ్రదర్'అని శోకతప్త హృదయాలతో తమ బాధను పంచుకున్నారు.
కోబ్ సాయం మరవలేనిది..
గాయాలతో సతమతమవుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనకు కోబ్ బ్రయంట్ ఇచ్చిన సలహాలు.. కలిగించిన స్పూర్తి మరవలేనిదని జొకోవిచ్ తెలిపాడు. ‘కోబ్ నా మెంటర్. ఎల్బో ఇంజ్యూరీతో మానసింగా, శారీరకంగా కృంగిపోయి.. వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో పడిపోయి ఉన్న క్లిష్ట స్థితిలో కోబ్ విలువై సలహా ఇచ్చాడు. అతని మార్గ నిర్దేశకం నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. అదే నన్ను పుంజుకునేలా చేసింది.'అని ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. ఇక కొబ్ మరణ వార్త వినగానే తన గుండె రోదించిందని ట్వీట్ చేశాడు.
‘కొబ్ మరణ వార్త విని నా గుండె రోదించింది. అతను నా స్నేహితుడు.. అలాగే గొప్ప మెంటర్ కూడా. నీవు.. నీ కూతురు ఎప్పటికీ మా గుండేల్లోజీవిస్తారు. నీ మరణ వార్త విన్న నాకు.. ఆ బాధను పంచేందుకు మాటలు రావడం లేదు. ఈ చేదు వార్త ప్రతీ కుటంబంలో విషాదం నింపింది.'అని జొకోవిచ్ పేర్కొన్నాడు
మరవలేం కొబ్: షరపోవా
రష్యా టెన్నిస్ స్టార్ మరియ షరపోవా సైతం కోబ్ బ్రయంట్ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు కోబ్ ఎంతో సహాయం చేశాడని ట్వీట్ చేసింది. ‘కోబ్, గిగి(కోబ్ కూతురు) మీ మరణ వార్తతో నా గుండె పగిలింది. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు నా పట్ల నీవు చూపించిన ఔదార్యాన్ని ఎప్పటికీ మరవలేను కొబ్. నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని. నా హృదయం మీతో,మీ అందమైన కుటుంబంతో ఉంది.'అని సంతాపం వ్యక్తం చేసింది.
డియర్ బిగ్ బ్రో..
జపాన్ స్టార్ నవోమి ఒసాకా సైతం కోబ్ బ్రయంట్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కవితా రూపంలో ట్వీటర్ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications