Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీ ఆర్థిక సహాయం చేయకుంటే.. ఏం సాధించేవాడిని కాదు'

Virat Kohli gives Financial Support says Sumit Nagal


హైదరాబాద్:
20 సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెద‌ర‌ర్‌ను తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న 22 ఏళ్ల హరియాణా ఆటగాడు సుమిత్ నాగ‌ల్ కాసేపు వ‌ణికించిన విషయం తెలిసిందే. సుమిత్ తొలి సెట్‌లో విజయం సాధించి అందరికి షాక్ ఇచ్చాడు. తర్వాత అనవసర తప్పిదాలతో ఫెదరర్‌ ముందు తలొంచాడు. ఫెదరర్‌కు తొలి సెట్‌లో షాకివ్వడంతో టెన్నిస్ ప్రపంచానికి సుమిత్ సుపరిచుతుడయ్యాడు. అయితే తాను ఈ స్థాయికి చేరడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కారణం అని సుమిత్ అంటున్నాడు.
సహాయం చేయకుంటే..:

సహాయం చేయకుంటే..:

విరాట్ కోహ్లీ ముంబైలో 'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'ను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ఎంతో మంది అథ్లెట్లు, ఆటగాళ్లకు ఆర్థిక సహాయం అందించింది. అలా సాయం అందుకున్న వాళ్లలో సుమిత్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ తెలిపాడు. '2017 నుంచి విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సహాయం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంతకు ముందు రెండుళ్లు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయా. కోహ్లీ నాకు సహాయం చేయకపోయి ఉంటే.. ఏం సాధించేవాడిని కాదు' అని సుమిత్ పేర్కొన్నాడు.

క్రీడలను ప్రోత్సహించాలి;

క్రీడలను ప్రోత్సహించాలి;

'ఈ ఏడాది ఆరంభంలో కెనడా నుంచి జర్మనీ వెళ్లేప్పుడు నా జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదీ ఆ సహాయం అందాకే. అంటే గతంలో ఎలాంటి కష్టాలు ఎదురుకున్నానో అర్ధం చేసుకోండి. కోహ్లీ నుంచి సహాయం పొందడం నా అదృష్టం. ఇప్పుడు నా పరిస్థితులు బాగున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించడానికి జనాలు ముందుకు రావాలి. క్రీడలను అందరూ ప్రోత్సహించాలి' అని సుమిత్ విజ్ఞప్తి చేసాడు.

సొంత గడ్డపై టెస్ట్ ఆడలేదు.. దానికోసం ఎదురుచూస్తున్నా: విహారి

 ఫెద‌ర‌ర్‌కు షాక్:

ఫెద‌ర‌ర్‌కు షాక్:

యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో సుమిత్ అద్భుత ఆటతో 6-4 తేడాతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే అనంతరం వరుస సెట్‌లలో ఫెద‌ర‌ర్‌ పుంజుకోవడంతో 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్ ఓటమిని చవిచూశాడు. సుమిత్ రెండో సెట్‌లో తేలిపోయినా.. మూడో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చాడు. గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్‌ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్‌ రికార్డుల్లో నిలిచాడు. ఫెద‌ర‌ర్ లాంటి స్టార్ ఆట‌గాడిపై భార‌తీయ టెన్నిస్ ప్లేయ‌ర్ ఓ సెట్ గెల‌వ‌డం గొప్ప విషయం.

Story first published: Tuesday, September 3, 2019, 13:42 [IST]
Other articles published on Sep 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+