Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2026: కార్లోస్ అల్కరాజ్ ఔట్.. కుర్రాడి చేతిలో ఓటమి! సెమీఫైనల్‌కు పెగులా!

ప్రతిష్టాత్మ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2026లో సంచలన ఫలితం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వరుసగా రెండో టైటిల్ గెలవాలని భావించిన అల్కరాజ్‌కు చుక్కెదురైంది.

బుధవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నెంబర్ 2 అల్కరాజ్‌కు అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ ఊహించని షాకిచ్చాడు. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ 6-7, 6-1, 6-3, 1-6, 7-6(10/7) తేడాతో అల్కరాజ్‌ను చిత్తు చేశాడు.

15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీకి గర్ల్‌ఫ్రెండ్? ఫొటోలు వైరల్!

15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీకి గర్ల్‌ఫ్రెండ్? ఫొటోలు వైరల్!

గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన అల్కరాజ్ మునపటిలా సత్తా చాటలేకపోయాడు. క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్‌లోనే తృటిలో ఓటమిని తప్పించుకున్నాడు. 7-6(7/5) తేడాతో తొలి సెట్‌లో గట్టెక్కాడు. కానీ ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. అద్వితీయమైన ప్రదర్శనతో షెల్టన్ ఆధిపత్యం చెలాయించాడు.

US Open 2026 Ben Shelton Stuns Defending Champion Carlos Alcaraz to Reach Semifinals

నాలుగో సెట్‌ను గెలుచుకున్న అల్కరాజ్ మళ్లీ రేసులో నిలిచాడు. ఐదో సెట్‌లోనూ అతనికి కఠిన సవాల్ తప్పలేదు. చివరి వరకు పోరాడినా.. అల్కరాజ్‌కు ఓటమే ఎదురైంది. కోర్టులో చురుగ్గా ఉండే అల్కరాస్ ఈసారి మాత్రం చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఈ విజయంతో షెల్టన్ సెమీస్‌లో టియాఫోను ఢీకొట్టనున్నాడు.

ఫిట్‌నెస్ సమస్యలతో యానిక్ సినర్ యూఎస్ ఓపెన్ 2026 టోర్నీకి దూరంగా ఉండగా.. దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. తాజాగా అల్కరాజ్ కూడా నిష్క్రమించడంతో.. జ్వెరెవ్, టియాఫో రేసులో నిలిచారు. ఈ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్ అవుతారా? లేక కొత్త ప్లేయర్ టైటిల్‌ను గెలుస్తాడా? అనేది చూడాలి.

US Open 2026: ఘాటైన గంజాయి వాసన.. మ్యాచ్‌ ఆపేసిన సబలెంకా!

Also Read

US Open 2026: ఘాటైన గంజాయి వాసన.. మ్యాచ్‌ ఆపేసిన సబలెంకా!

సెమీఫైనల్‌కు పెగులా

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులా 3-6, 6-4, 6-3 తేడాతో అమెరికాకే చెందిన ఎమ్మా నవ్వార్రోను ఓడించింది. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పెగులా తొలి సెట్‌ను కోల్పోయింది. ఎమ్మా నవ్వార్రో చురుకైన ఆటతీరుతో పెగులా సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-3తో సెట్ గెలుచుకుంది. రెండో సెట్‌లో హోరాహోరీగా తలపడ్డారు.

4-4 వద్ద నవ్వార్రో చేసిన డబుల్ ఫాల్ట్‌ను అనుకూలంగా మార్చుకుని పెగులా సెట్‌ను 6-4తో కైవసం చేసుకుంది. కీలకమైన ఆఖరి సెట్‌లో పెగులా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ వరుస పాయింట్లు సాధించి 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది. దాంతో జెస్సికా పెగులా యుఎస్ ఓపెన్‌లో వరుసగా మూడోసారి సెమీఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ 1 అరినా సబలెంకాతో తలపడనుంది.

Story first published: Wednesday, September 9, 2026, 15:17 [IST]
Other articles published on Sep 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+