Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2025: జకోవిచ్ శంఖారావం.. లక్కీగా సెమీ‌స్‌కు సబలెంకా!(వీడియో)

రీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్ మరో ముందడుగు వేసాడు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో ఏడో సీడ్ నోవాక్ జకోవిచ్ అద్వితీయమైన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 7-5, 3-6, 6-4 తేడాతో అమెరికా స్టార్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. రెండో సెట్‌లో ఫ్రిట్జ్ తీవ్ర పోటీ ఇచ్చినా.. మూడో సెట్ గెలిచి నాలుగో సెట్‌కు మ్యాచ్‌ను తీసుకెళ్లినా..జకోవిచ్ తన అనుభవంతో ఒత్తిడిని అధిగమించి విజయాన్ని కైవసం చేసుకున్నాడు.

కీలకమైన బ్రేక్ పాయింట్‌లను సేవ్ చేసుకోవడం జకోవిచ్‌కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 12 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టి 29 అనవసర తప్పిదాలు చేశాడు. 4 డబుల్ ఫాల్ట్‌లతో పాటు 6 బ్రేక్ పాయింట్స్ సాధించాడు. మరోవైపు ఫ్రిట్జ్ 10 ఏస్‌లు, 46 విన్నర్లు కొట్టి 51 అనవసర తప్పిదాలు చేశాడు. ఇదే అతని కొంపముంచింది.

US Open 2025 Novak Djokovic s Dance of Love Sabalenka Advances on Walkover

5 డబుల్ ఫాల్ట్‌లతో పాటు 2 బ్రేక్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. అతనికి 13 బ్రేక్ పాయింట్ అవకాశాలు దక్కినా.. రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇది మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ గెలుపుతో ఫ్రిట్జ్‌తో ఉన్న ముఖాముఖి రికార్డ్‌ను జకోవిచ్ 11-0తో మరింత మెరుగుపర్చుకున్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో జకోవిచ్ రెండో సీడ్... కార్లోస్ అల్కరాజ్‌తో తలపడనున్నాడు.

జకోవిచ్ శంఖారావం..

ఈ విజయానంతరం జకోవిచ్ శంఖారావం చేశాడు. తన కూతురు బర్త్‌డే కానుకగా ఈ విజయాన్ని అందించాడు. విజయం సాధించిన వెంటనే శంఖారావం చేస్తూ ఫోజిచ్చిన జకోవిచ్.. ఆ తర్వాత ఒళ్ళు పులకరిస్తూ..బ్రేక్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సెమీస్‌కు సబలెంకా

మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మార్కేటా వాండ్రౌసోవా గాయంతో వైదొలిగింది. దాంతో సబలెంకా నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో కోకో గాఫ్‌ను ఓడించి నవోవి ఒసాకా, బార్బోరా క్రెజికోవాను ఓడించి జెస్సికా పెగులా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

Story first published: Wednesday, September 3, 2025, 11:19 [IST]
Other articles published on Sep 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+