Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2025: నేటి నుంచి షురూ.. గెలిచేది ఎవరూ?

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025కు రంగం సిద్దమైంది. నేటి(ఆదివారం) నుంచే యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. సినర్ తొలి రౌండ్‌లో విట్ కొప్రివా(చెక్ రిపబ్లిక్), ఒపెల్కా(అమెరికా)తో అల్కరాజ్ తలపడనున్నాడు. ఏడు సార్లు ఛాంపియన్ అయిన నొవాక్ జకోవిచ్(సెర్బియా) తొలి రౌండ్‌లో లోకల్ ప్లేయర్ లెర్నర్ టీన్‌తో ఆడుతాడు.

15 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?

అల్కరాజ్, జకోవిస్ సెమీస్‌లో తలపడే ఛాన్స్ ఉన్నాయి. ఓ అమెరికా ఆటగాడు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచి 22 ఏళ్లు అవుతుంది. మరి ఈ సారైనా ఆ నిరీక్షణకు తెరపడుతుందా? అనేది చూడాలి. గతేడాది అమెరికా నుంచి ఫ్రిట్జ్ ఫైనల్ ఆడాడు. 15 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఆటగాడిగా అతను రికార్డ్ సాధించాడు. ఈ సారి అతను టైటిల్ గెలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. చివరిసారిగా 2003లో ఆండీ రాడిక్ అమెరికా తరఫున యూఎస్ ఓపెన్ గెలిచాడు. ఫైనల్లో జువాన్ కార్లోస్ ఫెర్రర్‌(స్పెయిన్)ను ఓడించాడు. అప్పటినుండి ఇప్పటి వరకు ఏ అమెరికా ఆటగాడు కూడా యూఎస్ ఓపెన్ ఫురుషుల సింగిల్స్ టైటిల్ గెలవలేదు.

US Open 2025 Kicks Off Today 15-Year American Drought Ends in Grand Slam Glory

సినర్ X అల్కరాజ్..

గత రెండేళ్లుగా పురుషుల గ్రాండ్ స్లామ్ టైటిళ్లను యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ పంచుకుంటున్నారు. 2024 ఆరంభం నుంచి గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి 16 ప్రధాన టెన్నిస్ టోర్నీలు జరిగితే 15 టైటిళ్లను ఈ ఇద్దరే పంచుకున్నారు. 2024 మాడ్రిడ్ ఓపెన్‌లో మాత్రమే ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లో నిష్క్రమించారు. మిగతా 15 టోర్నీల్లో ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ సాధించారు. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 2024 ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ఈ ఇద్దరే గెలుచుకున్నారు. గతేడాది సినర్ ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్‌లు గెలుచుకోగా.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లను అల్కరాజ్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌ టైటిళ్లను సినర్ దక్కించుకోగా.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. గత రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఫైనల్లో ఈ ఇద్దరే తలపడి చెరొకటి గెలుచుకున్నారు. యూఎస్ ఓపెన్ 2025లోనూ ఈ ఇద్దరే చెలరేగుతారా? మరో ఆటగాడికి అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.

స్వైటెక్ X సబలెంక

మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక(బెలారస్), రెండో సీడ్ స్వైటెక్(పోలెండ్) హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. మూడో సీడ్ కోకో గాఫ్(అమెరికా), నాలుగో సీడ్ పెగులా(అమెరికా), ఐదో సీడ్ ఆండ్రీవా(రష్యా)పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కావడంతో టైటిలే లక్ష్యంగా ప్లేయర్స్ సిద్దమవుతున్నారు.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో గత నాలుగేళ్లలో నలుగురు కొత్త ఛాంపియన్స్ ఆవిర్భవించారు. 2021లో బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రుదుకా, 2022లో స్వైటెక్, 2023లో కోకో గాఫ్, 2024లో సబలెంక ఛాంపియన్స్‌గా నిలిచారు. ఈ సారి టైటిల్ ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Sunday, August 24, 2025, 11:24 [IST]
Other articles published on Aug 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+