ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో స్టార్ ప్లేయర్స్ నొవాక్ జకోవిచ్, అరెనా సబలెంకా, ఎమ్మా రాడుకా శుభారంభం చేశారు. 13వ సీడ్ డేనియల్ మెద్వెదేవ్‌కు మాత్రం బిగ్ షాక్ తగిలింది. తొలి రౌండ్‌లోనే ఈ రష్యా ఆటగాడు ఇంటిదారి పట్టాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ 6-1, 7-6(7/3), 6-2 తేడాతో విజయం సాధించారు. రెండో సెట్‌లో జకోవిచ్ కాస్త తడబడినప్పటికీ.. తన అనుభవాన్ని ఉపయోగించి గట్టెక్కాడు. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో జకోవిచ్.. అమెరికా ప్లేయర్ జాకరీ స్వజ్డాతో తలపడనున్నాడు.
మాజీ ఛాంపియన్ రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఫ్రెంచ్ ఆటగాడు బెంజమిన్ బోంజి చేతిలో 6-4, 7-5, 6-7(5), 0-6, 6-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇతర పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ బెన్ షెల్టన్(అమెరికా) గెలుపు బోణీ కొట్టాడు. ఇతర పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఆరో సీడ్ బెన్ షెల్టన్(అమెరికా) శుభారంభం చేశాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో షెల్టన్ 6-3, 6-2, 6-4 తేడాతో ఇగ్నాసియో బుసె(పెరూ)ను ఓడించాడు. 16వ సీడ్ జాకుబ్ మెన్‌సిక్(చెక్ రిపబ్లిక్)7-6/(7/5), 6-3, 6-4తో నికోలస్ జారీ(చిలీ)పై, 18వ సీడ్ డేవిడోవిచ్ ఫొకినా(స్పెయిన్) 6-1, 6-1, 6-2తో అలెంగ్జాండర్ షెవ్‌చెంకో(కజకిస్థాన్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.

మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ అరెనా సబలెంకా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో సబలెంకా 7-5, 6-1 తేడాతో స్విస్ టెన్నిస్ స్టార్ రెబెకా మసారోవాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సబలెంకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో రష్యాకు చెందిన పోలినాకు డెర్మెటోవాపై విజయం సాధించారు.
2021 యూఎస్ ఓపెన్ విజేత ఎమ్మా రాడుకా 6-1, 6-2తో ఇనా షిబహారా(జపాన్)పై గెలుపొందింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రాడుకా రెండు ఏస్‌లు సంధించింది. మరోవైపు షిబహారా ఐదు డబుల్ ఫాల్ట్‌లతో పాటు 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
బెంజమిన్ బోంజి - డానిల్ మెద్వెదెవ్‌పై 6-3, 7-5, 6-7(5), 0-6, 6-4 తేడాతో విజయం.
జెస్సికా పెగూలా - మయార్ షెరీఫ్‌పై 6-0, 6-4 తేడాతో విజయం.
నొవాక్ జొకోవిచ్ - లీనర్ టియెన్‌పై 6-1, 7-6(3), 6-2 తేడాతో విజయం.
ఎమ్మా నవారో - వాంగ్ యాఫన్‌పై 7-6(9), 6-3 తేడాతో విజయం.
జాస్మిన్ పావోలిని - డెస్టనీ అయవాపై 6-2, 7-6(4) తేడాతో విజయం.
విక్టోరియా అజరెంకా - హినా ఇనోయ్‌పై 7-6(0), 6-4 తేడాతో విజయం.
ఆర్యనా సబలెంకా - రెబెకా మసారోవాపై 7-5, 6-1 తేడాతో విజయం.
టెయ్లర్ ఫ్రిట్జ్ - ఎమిలియో నవాపై 7-5, 6-2, 6-3 తేడాతో విజయం.
బెన్ షెల్టన్ - ఇగ్నాసియో బ్యూస్‌పై 6-3, 6-2, 6-4 తేడాతో విజయం.
ఎమ్మా రాడుకాను - ఈనా షిబహారాపై 6-1, 6-2 తేడాతో విజయం.
జానిస్ త్జెన్ - వెరోనికా కుదెర్మెటోవాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం.