For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2025: అల్కరాజ్ శుభారంభం.. విలియమ్స్ ఔట్!

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ‌ యూఎస్ ఓపెన్ 2025లో రెండో సీడ్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. భారత కాలమానం సోమవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6-4, 7-5, 6-4 తేడాతో అమెరికా ప్లేయర్ రీల్లీ ఓపెల్కాను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండు గంటల ఐదు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

14 ఏస్‌లు కొట్టడంతో పాటు 6 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ తను అనుభవాన్ని ఉపయోగించి అల్కరాజ్ విజయం సాధించాడు. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో అల్కరాజ్.. ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ మట్టియా బెల్లుసితో తలపడనున్నాడు.

US Open 2025 Day 2 Highlights Carlos Alcaraz beats Opelka Venus Williams crashes out

ఇతర మ్యాచ్‌ల్లో బ్రిటన్‌కు చెందిన ఐదో సీడ్ జాక్ డ్రేపర్ 6-4, 7-5, 6-7(7), 6-2తో అర్జెంటీనా క్వాలిఫైయర్ ఫెడెరికో అగస్టిన్ గోమెజ్‌పై విజయం సాధించాడు. నార్వేకు చెందిన 12వ సీడ్ కాస్పర్ రూడ్ 6-1, 6-2, 7-6(5) తేడాతో ఆస్ట్రియాకు చెందిన సెబాస్టియన్ ఆఫ్నర్‌ను ఓడించాడు.

మహిళ సింగిల్స్‌లో సంచలన ఫలితం నమోదైంది. స్టార్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ముచోవా చేతిలో 6-3, 2-6, 6-1 తేడాతో ఓటమిపాలైంది. కజకిస్తాన్‌కు చెందిన తొమ్మిదో సీడ్ ఎలెనా రిబాకినా 6-3, 6-0 తేడాతో అమెరికా ప్లేయర్ జులియెటా పరేజాను ఓడించి రెండో రౌండ్‌లోకి సులువుగా ప్రవేశించింది. రెండుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ బార్బోరా క్రెజిసికోవా 6-3, 6-2 తేడాతో కెనడియన్ ఓపెన్ విజేత విక్టోరియా ఎంబోకోను ఓడించింది.

Story first published: Tuesday, August 26, 2025, 11:30 [IST]
Other articles published on Aug 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+