For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2025: చరిత్ర సృష్టించిన సబలెంకా

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌‌లో టాప్ సీడ్ బెలారస్ బ్యూటీ అరీనా సబలెంకా ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 4-6, 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ జెస్సికా పెగులాను ఓడించింది. ఈ గెలుపుతో వరుసగా మూడు సార్లు యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా సబలెంకా రికార్డ్ నమోదు చేసింది.

2023, 2024తో పాటు తాజా ఎడిషన్‌లోనూ సబలెంకా ఫైనల్ చేరింది. గతేడాది జరిగిన ఫైనల్లోనూ పెగులాను సబలెంకా చిత్తు చేసింది. మరోసారి పెగులాపై పై చేయి సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే యూఎస్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచిన రెండో ప్లేయర్‌గా నిలుస్తుంది. 2012-2014 మధ్య అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వరుసగా మూడు టైటిళ్లు గెలిచింది.

US Open 2025 Aryna Sabalenka Powers Past Jessica Pegula to Reach Third Consecutive US Open Final

అటాకింగ్ గేమ్‌తో..

పెగులాతో 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయింది. ఈ సెట్‌లో సబలెంకా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండో సెట్‌లో పుంజుకున్న ఈ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్..తనకే సాధ్యమైన పవర్‌ఫుల్ గేమ్‌తో పెగులాను ఒత్తిడిలోకి నెట్టింది. చివరి వరకు ఆధిక్యం కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి సెట్‌లో బ్రేక్ పాయింట్స్ సాధించిన సబలెంకా సునాయస విజయాన్నందుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో సబలెంకా 8 ఏస్‌లతో పాటు 43 విన్నర్లు కొట్టగా.. నాలుగు డబుల్ ఫాల్ట్స్‌ చేసింది. 7 బ్రేక్ పాయింట్స్ అవకాశాలు రాగా.. మూడింటిని ఖాతాలో వేసుకుంది. మరోవైపు పెగులా 3 ఏస్‌లతో పాటు 21 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 32 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 7 బ్రేక్ పాయింట్స్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సొంతం చేసుకుంది. సబలెంకా మొత్తం 90 పాయింట్స్ రాబట్టగా.. పెగులా 88 పాయింట్స్‌కే పరిమితమైంది. సబలెంకా 16 గేమ్స్ గెలిస్తే.. పెగులా 13 గేమ్స్‌ గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో సబలెంకా.. అమెరికా స్టార్ అమాండా అనిసిమోవా‌తో తలపడనుంది.

Story first published: Friday, September 5, 2025, 11:36 [IST]
Other articles published on Sep 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+