Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2024: భారత ఆటగాళ్లు శుభారంభం.. సిట్సిపాస్ ఔట్

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌ 2024లో భారత డబుల్స్ ఆటగాళ్లు యుకీ బాంబ్రి, బాలాజీలు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఇండో-ఫ్రాన్స్‌ జంట యుకీ-ఒలివెట్టి 6-3, 6-4తో రెయాన్‌ సెగర్‌మెన్‌-ప్యాట్రిక్‌ త్రహాక్‌పై విజయం సాధించింది.ఇండో-అర్జెంటీనా జోడీ శ్రీరామ్‌ బాలాజీ-గుడియో ఆండ్రియోజి 5-7, 6-1, 7-6(10)తో మార్కస్‌ డేనియల్‌- మిగ్వేల్‌ ఏంజిల్‌ రీస్‌పె నెగ్గి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

సిట్సిపాస్ ఔట్..
పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్ సిట్సిపాస్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్ 6-7(5-7), 6-4, 3-6, 5-7తో కొకినాకిస్(ఆస్ట్రేలియా) చేతిలో పరాజయంపాలయ్యాడు. సిట్సిపాస్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 51 అనవసరం తప్పిదాలతో మూల్యంచెల్లించుకున్నాడు. కొకినాస్ 17 ఎస్‌లు, 47 విన్నర్లు కొట్టాడు.

US Open 2024 Indian stars Sriram Balaji and Yuki Bhambri move to second round

ఇతర మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-1, 6-1, 7-6(4)తో హిజికటా (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెం:1 సిన్నర్‌ (ఇటలీ) 2-6, 6-2, 6-1, 6-2తో మెక్‌ డొనాల్డ్‌ (అమెరికా)పై, అల్కారజ్‌ (స్పెయిన్‌) 6-2, 4-6, 6-3, 6-1తో లి టు (ఆస్ట్రేలియా)పై, 5వ సీడ్‌ మెద్వెదెవ్‌ 6-3, 3-6, 6-3, 6-1తో లజోవిచ్‌పై, హర్కాజ్‌ 6-3, 7-6(4), 7-6(3)తో టిమోఫి స్కటోవ్‌పై గెలుపొందారు.

కాగా, 5 గంటల 35 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో డాన్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌) 6-7(6), 7-6(2), 7-6(4), 4-6, 6-4తో కచనోవ్‌పై పోరాడి గెలుపొందాడు. 1970లో టై బ్రేక్‌ ప్రవేశపెట్టిన తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో సుదీర్ఘంగా జరిగిన మ్యాచ్‌గా ఇది చరిత్రకెక్కింది.

క్రెజికోవాకు షాక్..
మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్‌ చాంపియన్‌ బార్బరా క్రెజికోవాకు బిగ్ షాక్ తగిలింది. రెండో రౌండ్‌లోనే ఆమె వెనుదిరిగింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్‌ క్రెజికోవా (చెక్‌) 4-6, 5-7తో ఎలెనా గాబ్రియెలా రూజ్‌ (రుమేనియా) చేతిలో ఓటమి పాలైంది. ఇక 26వ సీడ్‌ పౌలా బడోసా (స్పెయిన్‌) 6-3, 7-5తో టౌన్‌సెండ్‌ (అమెరికా)పై, ఎలీస్‌ మెర్టిన్స్‌ 6-3, 6-2తో టామ్లజోవిచ్‌ (రుమేనియా)పై, నీమర్‌ (జర్మనీ) 6-4, 6-0తో యోయుకా (జపాన్‌)పై, మాడిసన్‌ కీస్‌ 6-4, 6-0తో మాయా జాయింట్‌పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకొన్నారు.

మాజీ చాంపియన్‌ ఒసాక 6-3, 6-2తో ఓస్తపెంకోను చిత్తు చేసింది. రిబకినా 6-1, 7-6(1)తో అలావాను, పౌలెనీ 6-7(5), 6-2, 6-4తో ఆండ్రెస్క్యూను, పెగుల 6-4, 6-3తో రోజర్స్‌ను ఓడించారు. టాప్ సీడ్ ఇగా స్వైటెక్(పోలాండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో స్వైటెక్ 6-4, 7-6(8-6)తో రష్యాకు చెందిన కమిలా రఖిమోవాను ఓడించింది.

Story first published: Thursday, August 29, 2024, 10:04 [IST]
Other articles published on Aug 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+