Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2023 సంచలనం.. టైటిల్ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్!

న్యూయార్క్: న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలన విజయం నమోదైంది. మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 19 ఏళ్ల కోకో గాఫ్ సెకండ్ సీడ్, బెలారస్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంకాను ఓడించింది. యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం కోకో గాఫ్‌కు ఇదే తొలిసారి. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో కోకో గాఫ్ 2-6, 6-3, 6-2 తేడాతో సబలెంకాను చిత్తు చేసింది.

సబలెంకా ఆధిపత్యం చెలాయించడంతో తొలి సెట్‌లో కోకో గాఫ్ ఓటమి పాలైంది. అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని కోకో గాఫ్.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ప్రత్యర్థి సబలెంకా 46 అనవసర తప్పిదాలు చేయడం కోకో గాఫ్‌కు కలిసి వచ్చింది.

 Coco Gauff beats Sabalenka to win maiden Grand Slam title

ఈ విజయంతో కోకో గాఫ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. 1979లో ట్రేసీ ఆస్టిన్, 1999లో సెరెనా విలియమ్స్ కోకో గాఫ్ కన్నా ముందు ఈ టైటిల్ సాధించారు. ఈ సీజన్ ఆరంభ టోర్నీ వింబుల్డన్‌లో కోకో గాఫ్ తొలి రౌండ్‌లోనూ ఇటిదారిపట్టింది.

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ పరాజయాలతో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్న కోకో గాఫ్.. వరుసగా 18 విజయాలతో రెండు టూర్ టైటిల్స్, ఓ గ్రాండ్‌ స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు రూ. 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది.

 Coco Gauff beats Sabalenka to win maiden Grand Slam title
Story first published: Sunday, September 10, 2023, 9:34 [IST]
Other articles published on Sep 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+