For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US OPen: ఫైనల్ చేరిన జొకోవిచ్.. అరదైన రికార్డుకు అడుగు దూరంలో సెర్బియా స్టార్!

 US Open 2021: Novak Djokovic beats Olympic Gold medalist Alexander Zverev to enter final

న్యూయార్క్: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన టెన్నిస్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించడానికి వరల్డ్ నంబర్‌వన్‌ నొవాక్ జొకోవిచ్‌ అడుగు దూరంలో నిలిచాడు. 21వ టైటిల్‌పై కన్నేసిన ఈ సెర్బియా యోధుడు.. యుఎస్‌ ఓపెన్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌లను గెలిచిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గెలిచే పనిలో పడ్డాడు.

శనివారం తెల్లవారు జామున జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో జొకోవిచ్ 4-6 6-2 6-4 4-6 6-2 తేడాతో టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇద్దరూ ఐదు సెట్లు ఆడారు. చివరికి జొకోవిచ్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌.. కెనడా ఆటగాడు ఫెలిక్స్‌ ఆగర్‌తో తలపడి 6-4, 7-5, 6-2 మూడు వరుస సెట్లను కైవసం చేసుకొని ఫైనల్‌ చేరాడు. దీంతో జొకోవిచ్‌, మెద్వెదేవ్‌ టైటిల్‌ పోరులో తలపడనున్నారు.

మహిళల సింగిల్స్‌లో ఇంగ్లండ్ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి క్వాలిఫయర్‌గా కూడా నిలిచింది. 17వ సీడ్‌ గ్రీస్‌ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత అందుకుంది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది. రష్యా సుందరి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకుంది.

గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గ్రీస్‌ ప్లేయర్‌ మారియా సక్కారీని 6-1, 6-4 తేడాతో ఓడించి ఎమ్మా రాడుకాను తుది పోరులో నిలిచింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఎమ్మా.. 17 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఫైనల్‌లో మరో టీనేజర్‌, 19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌తో ఆమె తలపడనుంది. 1999 తర్వాత ఇలా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది.

Story first published: Saturday, September 11, 2021, 11:26 [IST]
Other articles published on Sep 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+