For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: జాతి వివక్షకు వ్యతిరేకంగా మాస్క్‌తో బరిలోకి దిగిన నవోమి ఒసాక!

US Open 2020: Naomi Osaka wears mask To Spread Awareness About Racial Injustice

న్యూయార్క్‌: జాతి వివక్షకు వ్యతిరేకంగా జపాన్ స్టార్ ప్లేయర్ నవోమి ఒసాక మాస్క్‌తో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ బరిలోకి దిగింది. ఆ మాస్క్‌పై గత మార్చిలో అమెరికా పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్లజాతీ మహిళ, నర్స్ బ్రయోనా టేలర్ పేరు రాసి ఉంది. ఒకవైపు కరోనా వైరస్‌ భయం... మరోవైపు పలువురు టాప్‌ స్టార్లు లేకుండా... ఇంకోవైపు కఠినమైన ఆంక్షలు... ప్రేక్షకులకు లేని ప్రవేశం... వంటి ప్రతికూల పరిస్థితుల్లో సోమవారం యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.

నల్లజాతి మహిళనంటూ...

ఈ టోర్నీకి ముందు జరిగిన వెస్టర్న్‌ అండ్‌ సదరన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ (సిన్సినాటి ఓపెన్‌)‌లో కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా ఒసాక తన గళాన్ని విప్పింది. అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్‌ బ్లేక్‌పై పోలీసుల కాల్పుల ఘటన నిరసనగా టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అథ్లెట్‌ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ఒసాక ట్విటర్‌లో పేర్కొంది. దీంతో టోర్నీ ఒకరోజు ఆగిపోయింది. అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్న ఒసాక సెమీఫైనల్ ఆడి ఫైనల్ చేరింది. అయితే గాయం కారణంగా ఫైనల్ ఆడకుండానే నిష్క్రమించింది. ఈ గాయం నేపథ్యంలో యూఎస్ ఓపెన్‌లో ఆడుతుందో లేదోననే సందేహాలు నెలకొన్నాయి.

శుభారంభం..

కానీ మంగళవారం జరిగిన తొలి పోరులో ఒసాక 6-2, 5-7, 6-2తో జపాన్ ప్లేయర్, 81వ ర్యాంకర్ అయిన మిసాకి దోయి‌పై గెలిచి శుభారంభం చేసింది. ఈ విజయానంతరం మాట్లాడుతూ.. జాతి వివక్షపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నట్లు తెలిపిన ఈ జపాన్ స్టార్.. అందుకే మాస్క్‌తో బరిలోకి దిగానంది. ‘టెన్నిస్‌ను యావత్ ప్రపంచం చూస్తుంది. చాలా మందికి బ్రయోనా టేలర్ విషాదాంతం గురించి తెలియకపోవచ్చు. నేను చేసే పనివల్లనైనా ఆమె గురించి తెలుసుకోవడానికి కొంతమంది గూగుల్ చేయవచ్చు. దాంతో నల్లజాతీయులపై జరుగుతున్న దారుణాలపై వారికి కొంత అవగాహన కలగవచ్చు. జాతి వివక్షపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడమే నా లక్ష్యం'అని పేర్కొంది.

నోవాక్ జకోవిచ్ కూడా..

నోవాక్ జకోవిచ్ కూడా..

టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ కూడా యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జకోవిచ్ 6-1, 6-4, 6-1 తేడాతో బోస్నియా అండ్‌ హర్జెగోవినా ప్లేయర్ డామిర్‌ జుముర్‌పై గెలుపొందాడు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ పోరులో జకోవిచ్‌.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తన డిఫెన్స్‌తో జుముర్‌ను పూర్తిగా కట్టడిచేశాడు. ఇక రెండో రౌండ్‌లో అతడు ఇంగ్లాండ్‌ ఆటగాడు కైల్‌ ఎడ్మండ్‌తో తలపడనున్నాడు. అంతకుముందు ఎడ్మండ్‌ 2-6, 7-5, 7-5, 6-0 తేడాతో కజకిస్థాన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ బబ్లిక్‌ను ఓడించాడు.

 తప్పుకున్న ఫెదరర్, నాదల్

తప్పుకున్న ఫెదరర్, నాదల్

మరోవైపు ఈ మెగాగ్రాండ్‌ స్లామ్‌ ఈవెంట్‌లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లైన రోజర్‌ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ ఆడటం లేదనే విషయం తెలిసిందే. దీంతో ఈసారి యూఎస్‌ ఓపెన్‌ను జకోవిచ్ సొంతం చేసుకునే వీలుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ టైటిల్‌ సాధించిన అతడు ఇప్పుడు మరోసారి కన్నేశాడు. ఇది గెలిస్తే జకోవిచ్‌ 18వ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. అతడి కన్నా నాదల్‌ 19, ఫెదరర్ 20 ముందున్నారు.

Story first published: Tuesday, September 1, 2020, 18:30 [IST]
Other articles published on Sep 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+