Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమంత యాడ్ పై స్పందించిన సానియామీర్జా

ఒక మహిళగా తాను ఎదుర్కొన్న అనుభవాలపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) సుదీర్ఘ పోస్టు పెట్టారు. నటి సమంత ఇటీవల ఒక యాడ్ లో నటించారు. అది చూసిన తర్వాతే ఆమె ఈ విధంగా స్పందించారు. మహిళలు ధరించే దుస్తులు, భాగస్వామిని ఎంచుకోవడం వంటి విషయాల్లో ఆ మహిళల చుట్టూ ఉండేవారు తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేస్తారు. వాటిని దాటుకొని తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలనే ఉద్దేశం ఆ యాడ్‌లో ఉంది.

సమంత చేసిన యాడ్ చూసిన తర్వాత తనను ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయని, మహిళా టెన్నిస్ ప్లేయర్ ఏం సాధిస్తుంది? ఇది మహిళల ఆట కాదుకదా.. ఆమె ఎంతదూరం వెళుతుందో చూద్దాంలే అంటూ రకరకాల వ్యాఖ్యలు చేసేవారని సానియా తెలిపింది. కానీ తాను తన కల ప్రకారమే నడుచుకున్నానని, తనమీద తనకు నమ్మకం ఉందని, అందులో తనచుట్టూ ఉండేవారి అభిప్రాయాలను పట్టించుకోలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను విజయాన్ని అందుకోవాలనే త సంకల్పం ముందు అనుమానాలు, చెత్త వ్యాఖ్యలు చిన్నబోయాయన్నారు. తన కలలను సాకారం చేసుకోవాలనే కలలు కనే ప్రతి మహిళకు సమంత చేసిన యాడ్ ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా నిలుస్తోందని సానియా రాసుకొచ్చారు.

 saniyasamantha

సానియామీర్జా నాలుగు సంవత్సరాల వయసు నుంచే క్రీడలపై మక్కువ చూపారు. ఆరు సంవత్సరాల వయసులోనే టెన్నిస్‌ ఆట నేర్చుకున్నారు. 2003లో 16 సంవత్సరాల వయసులో ప్రొఫెషన్‌ టెన్నిస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం తన కెరీర్‌ను కొనసాగించారు. ఒక్క ఆటతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లోను తరుచుగా వార్తల్లో నిలిచారు. మ్యాచ్ లు జరిగే సమయంలో సానియా ధరించే దుస్తులు, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకోవడం కూడా చర్చకు దారితీశాయి. 2010లో సానియా షోయబ్ ను వివాహమాడారు. 2018లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. వివాహమైన తర్వాత సానియా దుబాయ్ లో నివసిస్తున్నారు.

Story first published: Saturday, May 6, 2023, 15:49 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+