Roger Federer సంచలన నిర్ణయం.. 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌కు స్విస్ దిగ్గజం గుడ్‌బై!

న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరిగే లావర్ కప్ తన కెరీర్‌లో చివరి టెన్నిస్ టోర్నీ అని ఈ స్విట్జర్లాండ్ స్టార్ తెలిపాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదిక ఓ సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశాడు. 'లండన్ వేదికగా వచ్చే వారం జరగనున్న ది లావర్ కప్‌తో నా 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నానను. ఈ 24 ఏళ్ల టెన్నిస్ జీవితం 24 గంటల్లా అనిపిస్తోంది.'అని ట్వీట్ చేశాడు.
2003 వింబుల్డన్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఫెడరర్.. కెరీర్ మొత్తం 6 ఆస్ట్రేలియా ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
మోకాలి గాయంతో..
ఇక గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన ఫెడరర్.. మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఈ ఏడాది జరిగిన ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. ఫెడరర్ కు ప్రస్తుతం 41 ఏళ్లు. ఇప్పటికే రెండు సార్లు అతని మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే వయో భారం అతని ఆటపై ప్రభావం చూపింది. ఇటీవలే మహిళా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ వీడ్కోలు పలకగా..ఇప్పుడు ఫెడరర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం టెన్నిస్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. రాఫెల్ నాదల్(22), నొవాక్ జకోవిచ్ (21) తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఫెడరర్ (20) గుర్తింపు పొందాడు.

82 శాతం విజయాలతో..
1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెడరర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 82 శాతం విజయాలు (1251-275) సాధించాడు. 21 ఏళ్ల వయసులో వింబుల్డన్ టైటిల్‌తో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన ఈ స్విస్ సూపర్ స్టార్.. అప్పటి వరకు నంబర్ వన్‌గా ఉన్న పీట్ సంప్రాస్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. చూస్తుండగానే 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా అవతరించాడు. అంతేకాకుండా 2018 వింబుల్డన్‌ను నెగ్గి 20వ టైటిల్‌ను ఖాతాలో వేసుకొని ఈ ఘనతను అందుకున్న తొలి పురుష ప్లేయర్ గా నిలిచాడు.

ఒంపిక్స్‌లో రెండు మెడల్స్..
2012 లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో సిల్వర్ గెలిచిన ఫెడరర్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫెడరర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 310 వారాల పాటు నంబర్ వన్ ర్యాంకులో ఉండటం విశేషం. ఇందులో వరుసగా 237 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. 2004 నుంచి 2008 మధ్య ఫెడరర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. వింబుల్డన్ టైటిల్‌ను 8 సార్లు గెలిచిన ఫెడరర్.. ఈ ఘనతను అందుకున్న ఏకైక ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్:
ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009
వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications