For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Simona Halep: డోపింగ్‌లో పట్టుబడిన మాజీ నెంబర్ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌.. నాలుగేళ్లు నిషేధం!

Simona Halep Provisionally Suspended For Doping

లండన్‌: రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌, 31 ఏళ్ల రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్‌ డోప్‌ పరీక్షలో విఫలమైంది. ఈ ఆగస్టులో యూఎస్‌ ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో మాజీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్‌ హలెప్‌ నిషేధిత డ్రగ్‌ తీసుకున్నట్టు రుజువైంది. దీంతో ప్రస్తుతానికి ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్‌ స్వచ్ఛత సంస్థ(ఐటీఐఏ) శుక్రవారం ప్రకటించింది. బి శాంపిల్‌ పరీక్షలోనూ పాజిటివ్‌ ఫలితం వస్తే.. హలెప్‌పై నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది. హలెప్ రొక్సాడస్టాట్ అనే డ్రగ్ వాడినట్లు తెలింది.

బ్లడ్ బూస్టర్‌గా పని చేసే రొక్సాడస్టాట్ ఎర్ర రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2002 నుంచి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) దీనిని నిషేధిత జాబితాలో పెట్టింది. తనపై నిషేధం విధించడంపై హలెప్ భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. తనకు తెలిసి ఏ తప్పు చేయలేదని, ఈ విషయం తేలే దాకా పోరాటం చేస్తానని పేర్కొంది. 'ఇన్నేళ్ల నా కెరీర్‌లో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా నాకు రాలేదు.

నా జీవితంలోనే ఇదో పెద్ద షాక్‌. గందరగోళంగా అనిపిస్తోంది. ద్రోహానికి గురయ్యా. నాకు తెలిసి ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదు. ఈ విషయం తేలే దాకా పోరాటం సాగిస్తా. గత 25 ఏళ్లలో టెన్నిస్‌పై పెంచుకున్న ప్రేమ, సాధించిన టైటిల్స్‌, గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా'అని హలెప్‌ పేర్కొంది.

సిమోనా హలెప్ 2006లో ప్రొఫెషనల్‌ టెన్నిస్ కెరీర్‌ను మొదలు పెట్టింది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ టైటిల్స్‌తో రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచింది. వీటితో పాటు 24 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచుకుంది. 2017 నుంచి 2019 మధ్య హలెప్ రెండు సార్లు నెంబర్ వన్ క్రీడా కారిణిగా కొనసాగింది. రొమేనియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.

Story first published: Saturday, October 22, 2022, 7:59 [IST]
Other articles published on Oct 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+