Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్రమ సంబంధాలతో సానియా మీర్జా విసిగిపోయింది.. షోయబ్ మాలిక్ సోదరి సంచలన వ్యాఖ్యలు!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌తో గత కొన్నేళ్లుగా సీక్రెట్ ఎఫైర్ నడిపిన షోయబ్ మాలిక్.. తాజాగా తమ అక్రమ సంబంధాన్ని పెళ్లితో సక్రమం చేసుకున్నాడు.

సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేకనే సానియా మీర్జా అతనికి విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ విడాకులపై సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 Sania Mirza was tired

కానీ తాజాగా షోయబ్ మాలిక్ తన మూడో పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అంతా షాకయ్యారు. ఈ మూడో పెళ్లికి షోయబ్ మాలిక్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా హాజరవ్వలేదు. అతని మూడో పెళ్లి పట్ల వాళ్లంతా ఆగ్రహంగా ఉన్నారని పాకిస్థాన్ డైలీ పేర్కొంది.

షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాలతో సానియా మీర్జా విసిగిపోయిందని మాలిక్ కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు ఎక్స్‌వేదికగా రాసుకొచ్చింది.

'షోయబ్ మాలిక్ కుటుంబ సభ్యులు ఎవరూ అతని మూడో పెళ్లి వేడుకకు హాజరవ్వలేదు. సానా జావెద్‌ను పెళ్లి చేసుకోవడం మాలిక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడాన్ని వారు సహించడం లేదు. సానియాకు అన్యాయం చేయడాన్ని షోయబ్ మాలిక్ సోదరి తీవ్రంగా తప్పుబట్టింది. షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయిందని తెలిపింది.'అని ది పాకిస్థాన్ డెయిలీ ట్వీట్ చేసింది.

2010లో ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో కొడుకు పుట్టాడు. ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.

తన కూతురు 41 ఏళ్ల షోయబ్ మాలిక్‌తో ముస్లిం చట్టం 'ఖులా' ప్రకారం విడాకులు తీసుకుందని మీడియాకు తెలిపారు. ఖులా అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం. దీని ద్వారా ఓ ముస్లిం మహిళ తన భర్త నుంచి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు.

Story first published: Saturday, January 20, 2024, 23:21 [IST]
Other articles published on Jan 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+