సానియాను కలిసేందుకు షోయాబ్‌కు అనుమతి.. నెల రోజులు హైదరాబాద్‌లోనే!!

హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ ఆల్‌రౌండర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయాబ్ మాలిక్ చేసిన అభ్యర్థనను ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్‌ను చూసివచ్చేందుకు పీసీబీ అనుమతించింది. దీంతో షోయాబ్ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. భార్య, కుమారుడితో కొన్ని రోజులు గడిపిన తర్వాత నేరుగా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు.

ఐదు నెలలుగా దూరం:
అమెరికాకు టెన్నిస్ టోర్నమెంట్ కోసం వెళ్లిన సానియా మీర్జా లాక్‌డౌన్ ముందు హైదరాబాద్ చేరుకోగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ మాలిక్ అక్కడే చిక్కుకుపోయాడు. లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయంగా విమానాల నిలిపివేతతో దాదాపు ఐదు నెలలుగా సానియా, షోయాబ్‌లు దూరంగా ఉంటున్నారు. దీంతో సానియా గత నెలలో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కూడా తెలిపారు. మరోవైపు ఐదు నెలలుగా కుటుంబంను చూడలేదని, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ముందు కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం ఇవ్వమని పీసీబీని షోయాబ్ అభ్యర్థించాడు.

కుటుంబంను కలిసేందుకు:
ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడిన పీసీబీ.. కుటుంబంను కలిసేందుకు షోయాబ్‌కు అనుమతిని ఇచ్చింది. 'కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణ నిషేధంతో షోయబ్ దాదాపు ఐదు నెలలుగా తన కుటుంబాన్ని చూడలేదు. ప్రయాణ ఆంక్షలు ఇప్పుడు క్రమంగా తొలగిస్తున్నందున కుటుంబంతో కలిసేందుకు అవకాశం ఉంది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడగా.. వారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. జూలై 24 న షోయబ్‌ను దేశంలోకి రానిచ్చేందుకు అంగీకరించారు' అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ చెప్పారు.

నెల రోజులు గడిపిన తర్వాత:
పాకిస్తాన్ జట్టు ఈ నెల 28న మాంచెస్టర్ బయలుదేరుతుంది. భార్య, కుమారుడితో దాదాపు నెల రోజులు గడిపిన తర్వాత వచ్చే నెల 24న షోయాబ్ మాలిక్ ఇంగ్లండ్‌లో ఉన్న జట్టుతో చేరుతాడు. పాక్ జట్టు డెర్బీషైర్ వెళ్ళే ముందు 14 రోజుల క్వారంటైన్ సమయంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ప్రాక్టీస్ చేసేందుకు స్థానిక జట్లు అందుబాటులో లేకపోవడంతో.. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంగ్లండ్‌తో పాక్ మూడు టెస్టులు, మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడనుంది.

2010లో వివాహం:
సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సంప్రదాయ పద్దతిలో షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకుంది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. 'పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ అక్కడే చిక్కుకున్నాడు. నేను లాక్‌డౌన్ ముందు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చా. దీంతో ఇజాన్‌ను చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో తెలియదు' అని ఇటీవల సానియా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సచిన్ జెర్సీ, బ్యాట్, బంతి చోరీ!!