సచిన్ జెర్సీ, బ్యాట్, బంతి చోరీ!!

కొచ్చి: క్రికెట్ దిగ్గజాల్లో సచిన్ టెండూల్కర్ ఒకరు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్‌కే వన్నె తెచ్చారు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై తన బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే.. తనే ఓ చరిత్రగా మిగిలిపోయారు. యావత్ క్రీడాభిమానులంతా సచిన్‌ను దేవుడిగా చూస్తారు. అయితే సచిన్ పరుగుల వరద పారించడమే కాకుండా తన వన్డే బౌలింగ్ కెరీర్‌లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేశారు.

జెర్సీ, బ్యాట్, బంతి చోరీ:
సచిన్ టెండూల్కర్ కేరళ రాష్ట్రం కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 5 వికెట్స్ హాల్ రెండుసార్లు సాధించారు. 1998లో ఆస్ట్రేలియాపై (5/32).. 2005లో పాకిస్తాన్‌పై (5/50) గొప్ప ప్రదర్శన చేసారు. దీంతో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సచిన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అభిమానులకు ప్రదర్శించడం కోసం సచిన్ తన టీమ్ జెర్సీ, సంతకం చేసిన బ్యాట్, బంతి జ్ఞాపకంగా అందజేశారు. ఇప్పుడు సచిన్ పెవిలియన్‌లో వాటి జాడ కనిపించడం లేదు.

ఫాన్స్ ఫైర్:
సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన వస్తువుల (జెర్సీ, బ్యాట్, బంతి) జాడ కనిపించడం లేదనే విషయం బయటపడే సరికి స్టేడియం అధికారులు ఇతరులపై తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వెతికినా అవి లభించలేదు. చివరకు ప్రాథమిక విచారణలో వాటిని ఎవరో దొంగతనం చేసినట్లు తేలింది. అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. ఇలా ఒక దిగ్గజ క్రికెటర్‌కు సంబంధించి వస్తువులను జాగ్రత్తగా ఉంచకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సచిన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
బ్యాటింగ్‌లో సెంచరీ ఎలాగో బౌలింగ్‌లో 5 వికెట్స్ హాల్ అలాగే.

కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు:
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించారు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశారు.

క్రికెట్ చరిత్రలో వంద శతకాలు:
2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రోహిత్ ఒక్కసారి కుదురుకుంటే.. ఆపడం ఎవరితరం కాదు: ధావన్