Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీనేజర్ చేతిలో సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురు.. ఫెడరర్‌కు తప్పని పరాజయం!

Serena Williams Crashes Out In Second Round In Emilia-Romagna Open

పార్మా (ఇటలీ): డబ్ల్యూటీఏ ఎమిలియా రొమానో చాలెంజర్‌ టోర్నీలో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ సెరెనా 6-7(4-7), 2-6తో 25 ఏళ్ల క్యాథరినా సినియాకోవా (చెక్‌రిపబ్లిక్‌) చేతిలో కంగుతిన్నది. 5 ఎస్‌లు సంధించిన సెరెనా.. 7 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం 8వ ర్యాంకరైన సెరానా.. 60వ ర్యాంకర్ అయిన క్యాథరినా ముందు నిలవలేకపోయింది. వరుస సెట్లలో ఓటమిపాలై రెండో రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది.

సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనా 6-3, 6-2తో క్వాలిఫయర్‌ లీసా పిగాటో (ఇటలీ)పై గెలిచి మూడు నెలల తర్వాత తొలి విజయాన్నందుకుంది. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఇక చివరి సారిగా సెరెనా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో గెలుపొందింది. గత వారం ఇటాలియన్ ఓపెన్‌లోనూ సెరెనాకు నిరాశే ఎదురైంది. ఇటాలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో సెరెనా 6-7 (6-8), 5-7తో నదియా పొదరోస్కా (అర్జెంటీనా) చేతిలో కంగుతింది.

ఫెడరర్‌కు షాక్..
జెనీవా: రెండేళ్ల విరామం తర్వాత క్లేకోర్టు బరిలోకిదిగిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన జెనీవా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్లో టాప్‌సీడ్‌ ఫెడరర్‌ 4-6, 6-4, 4-6తో పాబ్లో అండుజార్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు కొట్టిన పాబ్లో.. మూడుసార్లు రోజర్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండోరౌండ్‌ ఆడిన ఫెడరర్‌.. 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతను పోటీపడ్డ రెండో టోర్నీ ఇది.

2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో రఫెల్‌ నాదల్‌ చేతిలో ఓడిన ఫెదరర్‌ క్లేకోర్టుపై ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే. కుడి మోకాలికి రెండుసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న ఫెదరర్‌కు గత 15 నెలల్లో ఇది రెండో టోర్నీ మాత్రమే. ఈ మార్చిలో ఖతార్‌లో జరిగిన దోహా ఓపెన్‌లో అతడు తన రెండో మ్యాచ్‌లో పరాజయం పాలయ్యాడు.

ఫ్రెంచ్ ఓపెన్​కు వావ్రింకా దూరం
స్విస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా.. ఎడమ పాదానికి జరిగిన శస్త్ర చికిత్స నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొంటూ నిర్ణయం తీసుకున్నాడు వావ్రింకా.

Story first published: Wednesday, May 19, 2021, 9:52 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+