న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొవాక్ జొకోవిచ్‌పై భారీ కుట్ర.. లొంగదీసుకోవాలని సెర్బియా మోడల్‌కు రూ.52 లక్షల ఆఫర్!

Serbian model makes stunning claims A man offered me 60, 000 euros to seduce Novak Djokovic

బెల్‌గ్రేడ్‌: వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరు జొకోవిచ్ ఇమేజ్‌ను మసకబార్చేందుకు అమ్మాయిని ఎరగా వేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ అమ్మాయే వెల్లడించింది.

జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించి ఇస్తే.. రూ. 52 లక్షలు ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆఫర్‌ చేశాడని సెర్బియాకు చెందిన మోడల్‌ నటాలియా సెకిచ్‌ తెలిపింది. అయితే, జొకోవిచ్‌కున్న ఇమేజ్‌ను దెబ్బతీయడం తనకిష్టం లేదనీ.. అందుకే అతని ఆఫర్‌ను తిరస్కరించానని ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నటాలియా చెప్పుకొచ్చింది.

ఇక ఈ సెర్బియన్ స్టార్ ప్లేయర్ .. వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ విజయాలతో పాటే అతని పేరు, ప్రఖ్యాతులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే జొకోవిచ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెన్నీస్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్విస్ టెన్నిస్ స్టార్ కంటే ఒక వారం ఎక్కువగా చాంపియన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాడు.

Serbian model makes stunning claims A man offered me 60, 000 euros to seduce Novak Djokovic

ఇక ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలిఓపెన్ పురుషల సింగిల్స్ టైటిల్‌ను జొకోవిచ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్‌పై అలవోక విజయం సాధించిన జొకో.. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచాడు. దాంతో ఓవరాల్‌గా తన ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను వేసుకున్నాడు.

113 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ కు తొలి సెట్‌లో మినహా ఎక్కడా గట్టిపోటీ ఎదురుకాలేదు. కచ్చితమైన సర్వీస్, బుల్లెట్‌లాంటి రిటర్న్‌ షాట్‌లు,బేస్‌లైన్‌ వద్ద అద్భుత ఆటతీరుతో జొకో విచ్‌ చెలరేగడంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పలేదు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.

Story first published: Wednesday, March 24, 2021, 10:08 [IST]
Other articles published on Mar 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X