అథ్లెట్‌గా, అమ్మగా.. అనుభవాలు పంచుకోనున్న సానియా మీర్జా

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఓ క్రీడాకారిణిగా, అమ్మగా తన అనుభవాలను అంతర్జాతీయ అథ్లెట్లతో కలసి పంచుకోనుంది. ఈనెల 24న 'సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ ఒలింపియన్, పారా ఒలింపియన్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్రెస్' అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఒలింపిక్స్ వాయిదా పడినా.. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం ఐదు రోజులపాటు ఈ ఆన్‌లైన్ సమావేశం జరగనుంది. ఈనెల 28న శారీరక, మానసిక ఆరోగ్యంపై సానియా ముచ్చటించనుంది. తన శిక్షణ అనుభవాలతో ప్రేక్షకులు, అభిమానులు స్ఫూర్తి నింపనున్నట్టు మీర్జా తెలిపింది. ఇక.. సింగిల్స్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నవోమి ఒసాకా, బాస్కెట్‌బాల్ ప్లేయర్ హచిమురా, స్టార్ అథ్లెట్లు కొలిన్ జాక్సన్, అలీసన్ ఫెలిక్స్ తదితరులు కూడా ఈ ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒలింపిక్ యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం చేయనున్నారు.
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లోనే సాంప్రదాయ పద్దతిలో అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక వీరికి 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. కుమారుడికి జన్మనివ్వడంతో రెండేళ్లపాటు ఆటకు విరామం ఇచ్చిన సానియా.. జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతో పునరాగమనం చేసింది. అంతేకాకుండా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా టైటిల్ గెలిచింది.
అనంతరం ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ ఆడిన సానియా.. ఈ టోర్నీ సందర్బంగా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లింది. అక్కడి ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ... 'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్‌తో తన కుమారుడిపై ఉన్న ప్రేమను సానియా చాటుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications