For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట తగ్గించడంపై ఫోకస్ పెట్టిన సానియా.. జిమ్‌లో కఠిన వర్కౌట్స్‌తో కుస్తీ! (వీడియో)

 Sania Mirza struggles in gym for weight loss

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తోంది. బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ స్టార్.. తాజాగా తన వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో సానియా.. ఇతరుల్లానే జిమ్‌లో నానా కష్టాలు పడుతోంది. పింక్ టాప్, జిమ్ ప్యాంట్‌తో కనిపించిన సానియా.. రోప్ వర్కౌట్స్‌తో పాటు సైక్లింగ్, బాల్, యాబ్స్, జంప్/బాక్స్ ఎక్సర్‌సైజ్ చేస్తుందని కనిపించింది.

బరువు తగ్గడంతో పాటు లోయర్ బాడీ మజిల్స్ బలంగా ఉంచుకోవడం కోసం సానియా ఈ ఎక్సర్‌సైజులు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తన పొట్టను చూపిస్తూ దీని కోసమే ఈ కష్టమంతా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీడియోకు సునో కహో సునా అనే బాలీవుడ్ సాంగ్‌ను జత చేసి లిప్ సింక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల ముగిసిన స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)-లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. గత శనివారం జరిగిన ఫైనల్లో సానియా జోడీ 7-5, 5-7, 6-10 తేడాతో నికోల్‌ (అమెరికా)-దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. రేపటి(గురువారం) నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో సానియా డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీ పడనుంది. లూసీ హర్డెస్కాతో కలిసి డబుల్స్ ఆడనున్న సానియా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రోయేషియన్ టెన్నిస్ ప్లేయర్ ఇవాన్ డాడిగ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌ తర్వాత టెన్నిస్‌‌కు వీడ్కోలు పలుకుతానని సానియా మీర్జా ప్రకటించిన విషయం తెలిసిందే.

2013లోనే సింగిల్స్ ఆడటం మానేసిన సానియా డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా అందుకుంది. దాదాపు 91 వారాలా పాటు నంబర్‌వన్‌గా కొనసాగింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 270 ప్లస్ సింగిల్స్ విజయాలందుకున్న హైదరాబాద్ ప్లేయర్.. డబుల్స్‌లో 500 ప్లస్ విక్టరీలు నమోదు చేసింది. సింగిల్స్‌లో సానియా అత్యుత్తమ ర్యాంక్ 27 కాగా.. డబుల్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక సింగిల్స్ టైటిల్‌తో పాటు 40 డబుల్స్ టైటిల్స్, 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుపొందింది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో సానియా 14 పతకాలను సాధించింది. అందులో 6 బంగారు పతకాలున్నాయి.

Story first published: Wednesday, May 25, 2022, 17:27 [IST]
Other articles published on May 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+