సానియా.. షోయబ్‌ల ప్రేమకు చిహ్నంగా మీర్జా-మాలిక్

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. మంగళవారం ఉదయం సానియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్ మాలిక్ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా
'ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు.
4వ వన్డేలో ధావన్, కోహ్లీ ఔట్: తొడగొట్టిన విండిస్ బౌలర్ (వీడియో)
చాలా రోజుల తర్వాత శుభవార్త విన్నా
దీంతో సోషల్ మీడియాలో సానియా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్, సానియా బెస్ట్‌ఫ్రెండ్ ఫరాఖాన్ కూడా..‘చాలా రోజుల తర్వాత శుభవార్త విన్నాను. సానియా- మాలిక్ దంపతులకు అభినందనలు. అమ్మమ్మా తాతయ్యలుగా మారిన ఆనమ్-ఇమ్రాన్ మీర్జాలకు కూడా. ఆ దేవుడు మన బుల్లి రాకుమారుడిని దీవిస్తాడు.' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఐదు నెలల ప్రెగ్నెన్నీతో సెరెనా
గ్లోబల్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఐదు నెలల ప్రెగ్నెన్నీతో ఉన్నప్పుడు 2017 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. డెలీవరీ తర్వాత మాతృత్వ సమస్యలను ఎన్నో ఎదుర్కొన్న సెరెనా తన కూతురుకి అలెక్సిస్ ఒలింపియా అనే పేరు పెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications