4వ వన్డేలో ధావన్, కోహ్లీ ఔట్: తొడగొట్టిన విండిస్ బౌలర్ (వీడియో)

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 101 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) ఔటయ్యాడు. రోచ్ బౌలింగ్ వేసిన 16.4వ బంతిని ఆడబోయి షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ సిరిస్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ నాలుగు వన్డేలో సెంచరీ చేయకుండా నిరాశపరిచాడు. ప్రస్తుతం 25 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(60), అంబటి రాయుడు (15) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి (38) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 40 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 38 పరుగులు చేసిన ధావన్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.
పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధావన్
కీమోపాల్ బౌలింగ్‌లో కీరన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కీమో పాల్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి బ్యాట్‌కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పొవెల్ చేతుల్లో పడింది.
తొడగొడుతూ సంబరాలు చేసుకున్న కీమో పాల్
దీంతో ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకునే సంగతి అందరికీ తెలిసిందే. కీమో పాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా.. ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications