Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనితో సానియా మీర్జాకు రెండో పెళ్లి..?

భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్దమైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుడు ఫారినర్ అని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దుబాయ్‌కి చెందిన సదరు వ్యక్తి సానియా మీర్జాకు క్లోజ్ ఫ్రెండ్ అని, గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

అతని కోసమే సానియా మీర్జా దుబాయ్‌లో స్థిరపడిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ ఇద్దరి సీక్రెట్ లవ్‌కు కుటుంబ సభ్యుల ఆమోదం లభించిందని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులను ఒప్పించి రెండో వివాహానికి సానియా మీర్జా సిద్దమైందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా ఈ వివాహ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా కానీ, ఆమె కుటుంబం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Sania Mirza Second Marriage Rumours Surface Reports Claim She May Tie the Knot Again

2010లో సానియా వివాహం

సానియా మీర్జా 2010 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. 2018లో వారి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. 2024లో ఈ ఇద్దరు విడాకులతో విడిపోయారు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత.. సానియా కుటుంబం వారిద్దరి విడాకుల విషయాన్ని ధ్రువీకరించింది. హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా రిటైర్మెంట్ తర్వాత దుబాయ్‌లో నివసిస్తూ.. పలు వ్యాపారాలు చేస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. చాలా మంది అభిమానులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. పాకిస్థాన్‌కు కోడలుగా వెళ్లినా సానియా తన మాతృదేశంపై ప్రేమను మాత్రం వదులుకోలేదు. ఆమె కెరీర్ ఆసాంతం భారత్‌కే ప్రాతినిథ్యం ఇచ్చారు. షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల గురించి తెలిసే.. సానియా అతనితో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. సానియాతో వివాహ బంధంలో ఉండగానే షోయబ్ మాలిక్.. సనా జావేద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది.

ఇదే తొలిసారి కాదు..

సానియా మీర్జా రెండో పెళ్లికి సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఓ టాలీవుడ్ హీరోనూ సానియా మీర్జా పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా భారత క్రికెటర్ మహ్మద్ షమీని సానియా పెళ్లాడనున్నారనే వార్తలు హల్‌ఛల్ చేశాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని.. సానియా తన కొడుకు సమక్షంలోనే షమీని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను సానియా కొట్టిపారేసారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Story first published: Tuesday, August 18, 2026, 22:28 [IST]
Other articles published on Aug 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+