
ఆ ఫీలింగ్ ఏ పని చేసినా రాదు..
'ఆటకు వీడ్కోలు పలకడం వల్ల పోటీపడడం, గెలవడం, పోరాడడం వల్ల కలిగే అనుభూతిని కోల్పోతాను. పెద్ద కోర్టుల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య అడుగుపెడుతున్నప్పుడు కలిగే భావనే ప్రత్యేకంగా ఉంటుంది. అది ఇక నుంచి నాకు లభించదు. అన్నింటికన్నా ముఖ్యంగా రసవత్తర పోటీకి దూరమవుతా.
అది పెద్ద లోటు. రిటైర్మెంట్ తర్వాత నేనేం ఏం పని చేసినా..ఈ అనుభూతులు మళ్లీ నాకు కలగవు. ఆట కోసం సామాజికంగా నేను నిబంధనలను ఉల్లంఘించానని అనుకోవడం లేదు. ఈ నిబంధనలు పెట్టింది ఎవరు? ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలి. సమాజంగా మనం మరింత మెరుగుపడాలి.

ఒక్క ముస్లిం వర్గంలోనే కాదు..
ఏపనైనా కాస్త భిన్నంగా చేసినంత మాత్రాన వ్యక్తులను కీర్తించడమో లేదా చెడ్డవాళ్లుగా పరిగణించడమో చేయకూడదు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు నేను జీవిస్తున్నా. అందరూ అలా జీవించగలగాలి. మీకు నేను డిఫరెంట్‌గా కనిపించవచ్చు. దానర్థం నేను నియమాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తినని కాదు.
మహిళా క్రీడాకారులకు మద్దతివ్వకపోవడమనేది ఒక్క ముస్లిం వర్గంలోనే లేదు. ఈ ఉపఖండంలోనే ఉంది. లేదంటే అన్ని వర్గాల నుంచి చాలా మంది అమ్మాయిలు ఆటల్లో ఉండేవారు. తనను చాలా మంది బాక్సింగ్ చేయొద్దన్నారని భారత బాక్సర్ మేరీకోమ్ కూడా చెప్పింది.

నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు..?
మా కుటుంబం నన్ను టెన్నిస్‌లో ప్రోత్సహించడానికి ఏమాత్రం సంకోచించలేదు. మా కుటుంబం అప్పటి తరం కన్నా చాలా అడ్వాన్స్‌గా ఉంది. మా అమ్మానాన్న ఒత్తిడిని ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు కానీ.. నన్ను ఒత్తిడికి గురయ్యేలా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆట వల్ల నువ్వు నల్లబడితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని ఆంటీలు, అంకుల్స్ నాతో అనేవాళ్లు. ప్రతి మహిళా అథ్లెట్‌కు ఇలాంటి కథ ఉంటుంది'అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.

ఆర్‌సీబీ మెంటార్‌గా సానియా..
టెన్నిస్ వీడ్కోలు పలికిన అనంతరం సానియా మీర్జా మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. అది కూడా టెన్నిస్‌కు సంబంధం లేని క్రికెట్‌లో మెంటార్ బాధ్యతల నిర్వర్తించనుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు ఆర్‌సీబీ తమ మహిళా జట్టుకు సానియాను మెంటార్‌గా నియమించుకుంది. మ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి స్వాగతం పలికింది.


Click it and Unblock the Notifications
