For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటమితో టెన్నిస్‌కు సానియా గుడ్‌బై!

Sania Mirzas glorious career ends with first round defeat in Dubai

దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆటకు గుడ్‌బై చెప్పింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టోర్నీలో అమెరికా ప్లేయర్ మాడిసన్‌ కీస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా.. తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-మాడిసన్ జోడీ 4-6, 0-6తో రష్యా ద్వయం వెర్నోకియా-సంసొనోవా చేతిలో ఓటమి పాలైంది. గంటలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ వరకు కాస్త పోటాపోటీ జరిగినా.. ఆ తర్వాత ప్రత్యర్థి ద్వయం చెలరేగింది.

4-4తో స్కోరు సమమైన దశలో సానియా జోడీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రష్యా ద్వయం.. సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సానియా-కీస్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. సానియా జోడీ నుంచి నుంచి ప్రతిఘటన కరవైంది. తొలి గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది.

అభిమానుల అమితాసక్తి..

అభిమానుల అమితాసక్తి..

తన చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్‌కు చేరువగా వెళ్లి, ఫైనల్లో ఓడిన సానియా మీర్జా.. కెరీర్‌ చివరి టోర్నీలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తన కెరీర్లో ఇదే చివరి టోర్నీ అని, దీని తర్వాత రిటైరవబోతున్నానని సానియా ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చివరగా సానియా ఆట చూసేందుకు టెన్నిస్ అభిమానులు అమితాసక్తిని ప్రదర్శించారు.

6 ఏళ్ల వయసులోనే..

6 ఏళ్ల వయసులోనే..

ఆరేళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. 2001 నుంచి 2003 వరకు ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్‌లో తిరుగులేని విజయాలు సాధించింది. 2003లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారి అంతర్జాతీయ స్థాయిల్లో భారత్ తరఫున చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. వింబుల్డన్ గర్ల్స్ చాంపియన్‌షిప్‌తో సానియా ఆట ఓ మెట్టు పైకి ఎదిగింది. కెరీర్ మొత్తంలో ఆరు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ సాధించింది. మార్టినా హింగిస్(అమెరికా)తో కలిసి మహిళల డబుల్స్‌లో మూడు(2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్)ను సాధించింది. మహేశ్ భూపతితో కలిసి రెండు మిక్స్‌డ్ టైటిల్స్(2009 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్)ను అందుకుంది. 2014లో బ్రూనో సోరెన్‌తో కలిసి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకుంది. ఓవరాల్ కెరీర్‌లో సానియా 43 డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకుంది. డబుల్స్‌లో సత్తా చాటిన సానియా.. సింగిల్స్‌లో మాత్రం మెప్పించలేకపోయింది.

ఒలింపిక్ మెడల్ లోటు..

ఒలింపిక్ మెడల్ లోటు..

ఆసియా గేమ్స్‌లో రెండు గోల్డ్, మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించిన సానియా కెరీర్‌లో ఒలింపిక్ మెడల్ మాత్రం సాధించలేకపోయింది. బోపన్న‌తో కలిసి 2016లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించడం ఒలింపిక్స్‌లో సానియా అత్యుత్తమ ప్రదర్శన. సానియా నాలుగు ఒలింపిక్స్‌ (2008, 2012, 2016, 2020)లో పోటీపడినా.. ఒక్క మెడల్ సాధించలేకపోయింది.

గాయాలు..వివాదాలు..

గాయాలు..వివాదాలు..

2006-07 మధ్య కాలంలో తిరుగులేని ప్లేయర్‌గా విజయాలు సాధించిన సానియా.. ఆ తర్వాత గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంది. 2008 ఒలింపిక్స్ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన సానియాను 2010-12లో మణికట్టు గాయం తీవ్రంగా వేధించింది. మూడు సర్జరీలు చేయించుకోవడంతో ఆటపై పట్టు కోల్పోయింది. ఆ తర్వాత కఠినంగా శ్రమించి రీ ఎంట్రీ ఇచ్చింది. గాయాలతో పాటు సానియా కెరీర్‌లో వివాదాలున్నాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డ్రెస్ కోడ్‌పై చాలా అభ్యంతరాలు వచ్చాయి. పాక్ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడం కూడా వివాదాలకు దారి తీసింది. విమర్శలపై స్పందించని సానియా ఆటతోనే బదులిచ్చింది.

Story first published: Wednesday, February 22, 2023, 8:03 [IST]
Other articles published on Feb 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+