
హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను మనమే బాగు చేసుకోవాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పిలుపునిచ్చింది. ఇందుకోసం భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ఈ మేరకు #SupportSmallBySania, #SanDesi అనే హాష్ ట్యాగ్‌లతో సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
దీని ద్వారా లోకల్ బ్రాండ్స్‌ను ప్రోత్సహిస్తానని చెప్పింది. 'నేను లోకల్, యూనిక్ ఇండియన్ బ్రాండ్స్ గురించి చూస్తున్నా. మీవి అలాంటి సంస్థలైతే మీ వివరాలు నాకు మెయిల్ చెయ్యండి. మీ ప్రొడక్ట్స్ గురించి చెప్పండి'అని సానియా ఓ ఫొటో షేర్ చేసింది.
అంతేకాక 'లోకల్ బ్రాండ్స్ వాడకంపై గతంలో కంటే ఎక్కువగా ఇతరులను ప్రోత్సహించండి. ప్రస్తుత తరుణంలో 'సపోర్ట్ స్మాల్ బై సానియా'నినాదంతో నేను సమాజం రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. డిజైనర్స్, క్రాప్ట్స్ మెన్, ప్రాపర్టీ, రెస్టారెంట్స్ ఏవైనా కావొచ్చు. మేడిన్ ఇండియా అయితే మెసేజ్ లేదా మెయిల్ ద్వారా నాకు వివరాలు తెలియజేయండి. నాకు నచ్చిన 20 బ్రాండ్స్ గురించి సోషల్ మీడియాలో చెబుతా'అంటూ సానియా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.