సెమీస్‌లో సానియా-నదియా

హోబర్ట్ : రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సానియా మీర్జా-నదియాకిచ్‌నొక్(ఉక్రెయిన్) జోడీ 6-2, 4-6, 10-4తో కింగ్‌వానియ-మిక్‌హెల్ క్రిస్టినా (అమెరికా)జోడీపై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరింది.
గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ హోరా హోరీ పోరులో సానియా జోడీ ఆద్యంతం ఆకట్టుకుంది . క్వార్టర్స్‌లో సానియా-నదియా జోడీ మారి బౌజ్‌కోవ(చైనీస్ తైపీ)-తామర-జిడన్‌సెక్(స్లొవెనియా)తో తలపడనుంది. ఇక మంగళవారం జరిగిన తొలి పోరు సానియా జోడీ 2-6, 7-6 (3), 10-3 తేడాతో ఒక్సానా కలష్నికోవా (జార్జియా), మియు కటొ (జపాన్) ద్వయాన్ని ఓడించిన విషయం తెలిసిందే.
రెండేళ్ల విరామం తీసుకున్న సానియా చివరగా 2017, అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడింది. మోకాలి గాయంతో ఆ టోర్నీ నుంచి తప్పుకుంది.ఏప్రిల్ 2018లో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా ఈ టోర్నీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. కాగా, ఈ మ్యాచ్ ముందు సానియా బ్రీత్..రిఫ్రెష్. రిస్టార్ట్ అంటూ ట్వీట్ చేసింది.
Story first published: Thursday, January 16, 2020, 12:00 [IST]
Other articles published on Jan 16, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications