
మెల్‌బోర్న్: ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నెం.3 ర్యాంకర్ రోజర్ ఫెదరర్‌ను 100వ ర్యాంకరైన అమెరికా కుర్రాడొకడు వణికించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ స్విస్ స్టార్‌ను ఓడించేంత పనిచేశాడు. కానీ ఓటమి అంచుల నుంచి అద్భుతమైన రీతిలో ఫెదరర్ గట్టెక్కాడు. మెల్‌బోర్న్‌లోని లాడ్ లావర్ ఎరినాలో జరిగిన ఈ థ్రిల్లింగ్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఫెదరర్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరాడు.
ఫెడెక్స్ 6-3 2-6 2-6 7-6(8) 6-3 స్కోర్‌తో టెన్నిస్ సాండ్‌గ్రెన్(అమెరికా)పై గెలుపొందాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్ సెమీస్‌కు వెళ్లడం ఇది 15వ సారి. తొలి సెట్‌ను ఈజీగానే గెలిచినా.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను కోల్పోయి ఫెదరర్ ఇబ్బందుల్లో పడ్డాడు. కానీ కీలకమైన నాలుగో సెట్‌ను టై బ్రేకర్‌లో గెలుచుకుని మ్యాచ్‌పై ఆశలు నిలుపుకున్నాడు. ఆ తర్వాత చివరి సెట్‌ను కైవసం చేసుకుని.. సెమీస్‌లోకి దూసుకెళ్లాడు.
3 గంటల 28 నిమిషాల పాటు ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఫెదరర్ తన అనుభవాన్నంత రంగరించి విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు 44 విన్నర్లు ఆడిన ఫెడెక్స్.. కీలకదశలో రెండు బ్రేక్ పాయింట్లతో ప్రత్యర్థికి చెక్ పెట్టాడు. ఫెడరర్ కెరీర్‌లో ఇది 102వ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ విజయం కావడం విశేషం. దీంతో 101 విజయాలతో వింబుల్డన్‌లో ఉన్న తన రికార్డును దాటేశాడు. అదృష్టంతోనే గెలిచినట్లు మ్యాచ్ అనంతరం ఫెదరర్ తెలిపాడు.