Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qatar Open:రోజర్ ఫెడరర్‌కు షాక్.. 42వ ర్యాంకర్ చేతిలో ఓటమి!

Roger Federer crashes out of Qatar Open in quarterfinal after return

దోహా: దాదాపు ఏడాది విరామం తర్వాత కాంపిటీటివ్ టెన్నిస్‌లోకి పునరాగమనం ఇచ్చిన టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ప్రయాణం రెండు మ్యాచ్‌లతోనే ముగిసింది. ఖాతార్ ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్లో ఈ స్విస్ దిగ్గజానికి షాక్ తగిలింది. మోకాలికి రెండు సార్లు సర్జరీ చేయించుకున్న ఫెడరర్ కొంతకాలంగా ఆటకు దూరమయ్యాడు. రీఎంట్రీలో ఖతార్ ఓపెన్‌ను విజయంతో మొదలుపెట్టిన రోజర్ క్వార్టర్ ఫైనల్ మాత్రం దాటలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 1-6, 5-7తో 42వ ర్యాంకర్ నికోలోజ్ బసిలాష్యిలి(జార్జియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన ఫెడెక్స్ రెండో సెట్‌లో తేలిపోయాడు. హోరాహోరిగా సాగిన మూడో సెట్‌లో చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు చెరో 12 ఏస్‌లు కొట్టారు. రోజర్ ఐదు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్నే సద్వినియోగం చేసుకున్నాడు. పదింటిలో మూడింటిని యూజ్ చేసుకున్న జార్జియా ప్లేయర్.. స్విస్ మాస్టర్‌కు షాకిచ్చాడు.

Story first published: Friday, March 12, 2021, 7:47 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+