నిజాలు తెలుసుకోండి, ఫ్యాన్స్ మరువొద్దు: ఒలింపిక్స్‌లో ఓటమిపై సానియా
రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్ 2016లో తమ జంట ఓడిపోవడంపై టెన్నిస్ తార సానియా మీర్జా స్పందించారు. కేవలం శక్తి మేరకు ఆడాచూపగలమే గానీ, గెలుస్తామా? ఓడిపోతామా? అన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యానించారు.
రియో: తిట్టుకుంటూ వెళ్లి ఓడిన పేస్-బోపన్న, సానియా జోడీ ఓటమిప్రార్థనతో కలసి మహిళల డబుల్స్ విభాగంలో ఆడిన సానియా, తొలి రౌండులోనే తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గెలుపు, ఓటములు ఆటలో భాగమేనని, తమను విమర్శించడం మాని, ఈ విషయమై నిజాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు.

తన నుంచి భారత్ ఏం ఆశిస్తోందో తెలుసునని, పతకం తీసుకువచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయన్నారు. మిక్సెడ్ డబుల్స్‌లో బోపన్నతో కలసి ఆడుతున్నానని గుర్తు చేశారు. పతకం పడతానన్న ధీమా వ్యక్తం చేశారు. భారత్‌కు పతకం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానన్న ఒక్క విషయాన్ని అభిమానులు ఎన్నడూ మరవరాదన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications