Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియో: తిట్టుకుంటూ వెళ్లి ఓడిన పేస్-బోపన్న, సానియా జోడీ ఓటమి

రియో డి జెనిరో: బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సానియా మీర్జా - ప్రార్థన తోంబ్రే జోడీ ఇంటి దారి పట్టింది. అంతకుముందే రోహన్ బోపన్న - లియాండర్ పేస్ జోడీ మనసులు కలవక ఓటమి చవి చూసింది. తద్వారా భారత్‌కు టెన్నిస్‌లో వరుస పరాజయాలు ఎదురయ్యాయి.

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన సానియా - ప్రార్థన జోడి చైనా క్రీడాకారిణులు జంగ్‌ - పెంగ్‌ చేతిలో ఓడిపోయారు. సానియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నా ప్రార్థన పేలవ ఆటతీరు భారత్‌ విజయావకాశాల్ని దెబ్బతీసింది. దీంతో మ్యాచ్‌ను సానియా జోడి 6-7, 5-7, 7-5 తేడాతో చేజార్చుకుంది.

అంతకుముందే, రియో ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌ - రోహన్‌ బొపన్న జోడి ఓటమి పాలైంది. పోలెండ్‌ జంట మార్సిన్‌ మట్కోస్కీ-లూకాస్‌ కుబోట్‌ చేతిలో 4-6, 6-7 తేడాతో వీరు ఓడిపోయారు.

భారత్‌ తరఫున టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో పేస్‌-బొపన్న జోడీ ఎంపిక నుంచే అత్యంత నాటకీయ పరిణామాలు నడిచాయి. ఏదో విధంగా ఒలింపిక్స్‌కు ఇద్దరూ అంగీకరించారు అనుకుంటే తీరా క్రీడా గ్రామానికి వెళ్లిన తర్వాత అందరూ అనుకున్నదే జరిగింది. వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా ప్రాక్టీస్‌ చేయలేదు. పైగా చివరకు గదిని పంచుకోవడానికీ పోట్లాడుకున్నారు. ఇక, టెన్నిస్‌లో భారత్‌ ఆశలు సానియా మీర్జా- రోహన్‌ బోపన్న పోటీపడనున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ పైనే ఉన్నాయి.

సానియా మీర్జా

సానియా మీర్జా

బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సానియా మీర్జా - ప్రార్థన తోంబ్రే జోడీ ఇంటి దారి పట్టింది.

బోపన్నా, పేస్

బోపన్నా, పేస్

ఒలింపిక్స్‌లో ఆడాలని తెలిసీ.. కలిసి కాసేపైనా ప్రాక్టీస్ చేయని పేస్‌, రోహన్‌ బోపన్న జోడీ ఒలింపిక్‌ పురుషుల డబుల్స్‌లో ఆరంభ రౌండ్లోనే బోల్తా కొట్టింది. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌ ఆడుతున్న పేస్... బోపన్నతో కలిసి ఏ దశలోనూ గెలిచే జోడీలా కనపడలేదు. కోర్టులో ఇద్దరి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. పేస్‌ చాలా ఆలస్యంగా జట్టుతో చేరడంపై ప్రశ్నలు తలెత్తగా.. బోపన్నతో గది పంచుకోవడానికి అతడు తిరస్కరించాడన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఇష్టంలేని బంధానికి చేదు ముగింపునిచ్చింది.

జీతు రాయ్

జీతు రాయ్

రియో ఒలింపిక్స్ 2016లో 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో భారత్ క్రీడాకారుడు జీతూరాయ్ ఫైనల్లో ఓడిపోయాడు.

హాకీ టీం

హాకీ టీం

రియో ఒలింపిక్స్ 2016లో భారత్ హాకీ జట్టు గెలిచింది. ఆరంభ మ్యాచులో ఈ యువ ఆటగాళ్లు విజయ ఢంకా మోగించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+