Paris Olympics 2024: గోల్డ్ మెడల్ సాధించిన జకోవిచ్.. ఫైనల్లో అల్కరాజ్‌పై విజయం!
టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఎట్టకేలకు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆదివారం జరిగిన పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో నొవాక్ జకోవిచ్ 7-6(3), 7-6(2) వరుస సెట్లలో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్‌పై గెలుపొందాడు. ఈ విజయంతో జకోవిచ్ టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు.
37 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన జకోవిచ్.. ఈ ఘనతను అందుకున్న పెద్ద వయస్కుడిగా రికార్డ్‌కెక్కాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరిగిన వింబుల్డన్ టోర్నీలో ఇదే అల్కరాజ్ చేతిలో వరుస సెట్లలో ఓడిన నొవాక్ జకోవిచ్.. తాజా విజయంతో ఆ ఓటమికి బదులు తీర్చుకున్నాడు.

కెరీర్‌లో వెలతిగా ఉన్న బంగారు పతకాన్ని సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. జకోవిచ్‌కు ఒలింపిక్స్‌లో ఇదే తొలి స్వర్ణం. గతంలో అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు.
16 ఏళ్ల తర్వాత బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో గోల్డెన్ స్లామ్ సాధించిన స్టెఫీ గ్రాఫ్, ఆండ్రీ అగాస్సి, సెరెనా విలియమ్స్, రాఫెల్ నాదల్ సరస చేరాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. అల్కరాజ్ గట్టి పోటీనిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications