Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Novak djokovic: గోల్డెన్ చాన్సే.. కానీ ఒలింపిక్స్ ఆడుతానో లేదో!

Novak Djokovic unsure about Tokyo Olympics, says Will think about it

లండన్: టెన్నిస్‌లో చాలా అరుదుగా లభించే గోల్డెన్ స్లామ్ అందుకునే అవకాశం ముంగిట ఉన్నప్పటికీ టోక్యో ఒలింపిక్స్‌లో తాను పాల్గొంటానని ఖచ్చితంగా చెప్పలేనని సెర్బియా లెజెండ్, వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అంటున్నాడు. వింబుల్డన్‌లో హ్యాట్రిక్ టైటిల్‌తో కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన జొకో.. రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ సరసన నిలిచాడు.

ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గిన నొవాక్.. ఒలింపిక్స్‌లో గోల్డ్, ఆ తర్వాత యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిస్తే 'గోల్డెన్ స్లామ్' అందుకుంటాడు. అయితే, ఫ్యాన్స్ లేకుండా, కరోనా వైరస్ కఠిన నిబంధనల మధ్య జరగనున్న ఒలింపిక్స్‌ కోసం జపాన్ వెళ్లాలో వద్దో అనేదానిపై ఈ సెర్బియా స్టార్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు.

'టోక్యో గేమ్స్‌ బరిలో దిగడం గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేనెప్పుడూ ఒలింపిక్స్‌లో ఆడాలనే అనుకుంటా. కానీ, ఇప్పుడు మాత్రం నాకు క్లారిటీ లేదు. ఈ రెండు మూడు రోజులుగా జరిగిన పరిమాణాలు చూస్తే నేను టోక్యో వెళ్లే అవకాశాలు 50-50గా ఉండొచ్చని చెప్పవచ్చు'అని జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. టోక్యో గేమ్స్‌లో ఫ్యాన్స్‌కు ఎంట్రీ లేదన్న వార్త తనను నిరాశ పరిచిందన్నాడు.

ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా కెరీర్‌లో 6వ వింబుల్డన్ టైటిల్.. ఓవరాల్‌గా 20వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌-20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్‌ సెప్టెంబర్‌లలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్‌ లేవర్‌ (1969లో) తర్వాత 'క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌' ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. జొకోవిచ్ మొత్తం 9 ఆస్ట్రేలియ ఓపెన్ టైటిల్స్, 6 వింబుల్డన్, మూడు యూఎస్ ఓపెన్ ట్రోఫీలు నెగ్గాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు సార్లు చాంపియన్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, July 13, 2021, 8:30 [IST]
Other articles published on Jul 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+