Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2026: సెమీస్‌లో ఓటమి.. రిటైర్మెంట్‌పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు!

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో వింబుల్డన్ 2026 టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సినర్ 6-4, 6-4, 6-4తో వరుస సెట్లలో నొవాక్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై 39 ఏళ్ల జకోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

తానిప్పుడే రిటైర్ కానని, వచ్చే ఏడాది వింబుల్డన్ కూడా ఆడుతానని ప్రకటించాడు. జకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేంత వరకు టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం తనకు లేదని అభిమానులకు పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

Novak Djokovic Shuts Down Retirement Rumors After Wimbledon 2026 Exit Says he still feels healthy enough to compete

'నా టెన్నిస్ ప్రయాణం ఇంకా అయిపోలేదు. కనీసం మరో వింబుల్డన్ టోర్నీ అయినా ఆడుతా. మూడు రోజుల క్రితం క్వార్టర్‌ ఫైనల్లో సాధించిన విజయం మరువలేనిది. 39 ఏళ్ల వయసులో ఈ ప్రదర్శన నాకు మరింత శక్తినిచ్చింది. ఈ విజం పట్ల చాలా గర్వంగా ఉంది. ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఆడగలనని నాకు నేనే నిరూపించుకున్నాను. సెమీస్‌లో ఓడిపోవడం బాధించినప్పటికీ ఇక్కడి దాకా చేరుకోవడం సంతోషంగా ఉంది.

చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. కోహ్లీ, సచిన్‌కు సాధ్యం కానీ రికార్డ్!

చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. కోహ్లీ, సచిన్‌కు సాధ్యం కానీ రికార్డ్!

ప్రపంచ నంబర్ 1 సినర్ చేతిలో ఓడిపోయాను. ఈ ఓటమిని నేను అంగీకరించాల్సిందే. సెమీస్‌లో ఓడినా ఈ టోర్నీలో నా పోరాట పటిమ, అంకితభావం సానుకూల అంశాలే. 99 శాతం మంది ఆటగాళ్లకు సెమీఫైనల్ చేరడమే గొప్ప విజయమే. కానీ నాకు మాత్రం ఇది సరిపోదు. రెండు దశాబ్దాలకు పైగా అత్యున్నత విజయాలకు బాగా అలవాటుపడ్డాను. అందుకే ఎప్పుడూ విజేతగా నిలవాలనే అనుకుంటాను. ఆ అంచనాలు, వాస్తవాల మధ్య సమతుల్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నా.' అని జకోవిచ్ చెప్పుకొచ్చాడు.

వీళ్ల నుంచి కాదు.. అతన్ని టీ20ల్లోకి తీసుకోండి:క్రిష్ శ్రీకాంత్

వీళ్ల నుంచి కాదు.. అతన్ని టీ20ల్లోకి తీసుకోండి:క్రిష్ శ్రీకాంత్

ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన జకోవిచ్.. గత నాలుగేళ్లుగా తడబడుతున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం గత నాలుగేళ్లుగా పోరాడుతున్నాడు. కానీ ప్రతీ టోర్నీలో అతనికి నిరాశే ఎదురవుతుంది. 2023 తర్వాత జకోవిచ్ ఒక్క గ్రాండ్‌ స్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2023 యూఎస్ ఓపెన్ తర్వాత అతని ఖాతాలో మరో మేజర్ ట్రోఫీ చేరలేదు. 2024 వింబుల్డన్ ఫైనల్‌తో ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఫైనల్లోనూ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. వింబుల్డన్‌లో నిరాశ ఎదురవ్వడంతో అమెరికా హార్డ్‌కోర్ట్ సీజన్‌పై దృష్టి సారించాడు. నాలుగు సార్లు యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన జకోవిచ్.. ఈసారి టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.

Story first published: Saturday, July 11, 2026, 11:31 [IST]
Other articles published on Jul 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+