ఆ రెండు రికార్డులను బ్రేక్ చేస్తా: జొకోవిచ్

పారిస్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం, ఎక్కువ వారాలు నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగడం.. ఈ రెండు రికార్డులను తన కెరీర్ ముగిసేలోగా అధిగమిస్తానని సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అన్నాడు. ప్రస్తుతం ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో... స్పెయిన్ స్టార్ నాదల్ 19 టైటిల్స్‌తో రెండో స్థానంలో ... 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు.
'టెన్నిస్‌లో మరిన్ని ఘనతలుసాధించాననుకుంటున్నా. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఎక్కువ వారాలు టాప్ ర్యాంక్‌లో ఉండే రికార్డు సొంతం చేసుకుంటా. నా కెరీర్ ఈ రెండే టాప్ గోల్స్. ఆట పరంగా నేను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాననుకుంటున్నా. కరోనా ముగిసిన తర్వాత కచ్చితంగా టైటిల్స్ వేట మొదలు పెడతా. పరిమితులు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు.
కానీ లాంగ్ టైమ్ వరకు టెన్నిస్ ఆడతాననే నమ్మకం మాత్రం ఉంది. నేను ఇప్పటి వరకు ఆడిన టోర్నీల సంఖ్య కంటే రాబోయే రోజుల్లో ఆడేవి తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ట్రావెలింగ్ చేయకపోవచ్చు. ఇంత ఇంటెన్సిటీతో మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. కానీ సెలెక్టివ్‌గా 40 ఏళ్లు ఇచ్చే వరకు టెన్నిస్ అయితే ఆడతా'అని జోకో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న జొకోవిచ్ ఈ వారంతో ఆ హోదాలో 282 వారాలను పూర్తి చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications