Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ అవమానం వెంటాడుతోంది: జకోవిచ్

ఆస్ట్రేలియా విమానాశ్రయంలో ఎదురైన అవమానాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ అన్నాడు. ఈ సీజన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ 2025 కోసం ఆ దేశంలో అడుగుపెట్టిన జకోవిచ్.. పాత జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నానని తెలిపాడు.

'గత రెండు సార్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పుడు విమానాశ్రయంలో ఎదురైన అవమానాలు వెంటాడాయి. పాస్ పోర్ట్ తనిఖీ చేసే అధికారి మళ్లీ అడ్డుకుంటాడా? పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకుంటారా? అనే ఆలోచనలు వచ్చాయి.'అని జకోవిచ్ తెలిపాడు.

Novak Djokovic recalls COVID-19 trauma from 2022 deportation in Australia

మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ 2022 కోసం వచ్చిన అతన్ని విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. కరోనా టీకా తీసుకోకపోవడంతో అతన్ని దేశంలోకి అనుమతించలేదు. వీసాను రద్దు చేసి వెనక్కిపంపారు. ఈ వ్యవహారంపై సెర్బియా స్టార్ కోర్ట్‌కు వెళ్లి తిరిగి వీసాను దక్కించుకున్నాడు.

కరోనా తగ్గుముఖం పట్టడం, వీసా నిబంధనలు సడలించడంతో 2023 ఆసీస్ ఓపెన్‌లో రీఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటికే 10 సార్లు టైటిల్ అందుకున్నాడు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ 2025లో జకోవిచ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.ప్రస్తుత జకోవిచ్ కెరీర్‌లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో జకోవిచ్ మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్‌ అలెక్సీ పాప్రియన్‌ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గత 18 ఏళ్లలో యూఎస్‌ ఓపెన్‌‌లో నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకోవిచ్‌ నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ పరాజయం నేపథ్యంలో అప్‌కమింగ్ ఆస్ట్రేలియా ఓపెన్ 2025లో జకోవిచ్, అలెక్సీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచి మార్గరెట్ కోర్ట్ (24)ను సమం చేసిన జకోవిచ్.. మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు.

అతను 25వ టైటిల్ సాధిస్తాడా? లేదా? అని ఆసక్తికరంగా మారింది. జకోవిచ్ మరో టైటిల్ సాధిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధిక 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

Story first published: Wednesday, January 8, 2025, 12:57 [IST]
Other articles published on Jan 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+