
బెరెటినిపై విక్టరీ..
గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 5-7, 6-2, 6-2, 6-3తో ఆరో సీడ్ మటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6-3, 6-0, 4-6, 7-5తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్ వాన్ డె జండ్‌ష్చల్ప్‌పై గెలుపొందగా, నాలు గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7-6 (8/6), 6-3, 6-4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)కు 4-6, 4-6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో చుక్కెదురైంది.

ఫస్ట్ సెట్ కోల్పోయినా..
జొకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్‌ల దాకా ఇద్దరు సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 5-5తో సమంగా నిలిచారు. సెర్బియన్ సర్వీస్ చేసిన 11వ గేమ్‌ను బ్రేక్ చేయడం ద్వారా బెరెటిని 6-5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ సెట్ కోల్పోగానే జొకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన సెర్బియన్ స్టార్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్ద 19 పాయింట్లు సాధించిన జొకోవిచ్ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.

43 అనవసర తప్పిదాలు..
మరోవైపు ఇటలీ స్టార్ బెరెటిని... జొకో కంటే అత్యధికంగా 17 ఏస్‌లు సంధించినప్పటికీ ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ ఇక్కడ సెమీస్ చేరుకోవడం ఇది 12వ సారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెర్బియన్ స్టార్... జర్మనీకి చెందిన నాలుగో సీడ్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.
సకారి.. తొలిసారి: కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సాగుతున్న గ్రీసు అమ్మాయి సకారి.. తొలిసారి యుఎస్ ఓపెన్ సెమీస్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ 17వ సీడ్ అమ్మాయి 6-4, 6-4 తేడాతో నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గింది. 2016లో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ స్టార్‌ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్ ఓపెన్ ఆడుతున్న గ్రీస్ ప్లేయర్ సకారి తన కెరీర్‌లో తొలిసారి సెమీస్ చేరింది.


Click it and Unblock the Notifications












