Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Us Open 2025: దుమారం రేపిన జాత్యహంకర వ్యాఖ్యలు!(వీడియో)

ప్రతిష్టాత్మక గ్రాండ్‌‌ స్లామ్ టెన్ని‌స్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025 వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇప్పటికే అసభ్యకరంగా ప్రవర్తించిన రష్యా స్టార్ డానియల్ మెద్వెదెవ్‌పై రూ. 37 లక్షల జరిమానా పడగా.. తాజాగా మహిళా టెన్నిస్ స్టార్స్ దారుణంగా తిట్టుకున్నారు. గురువారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా అమెరికా ప్లేయర్ టేలర్ టౌన్‌సెండ్, లాట్వియాకు చెందిన జెలెనా ఒస్టాపెంకో మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

సహనం కోల్పోయిన ఈ ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో లోకల్ ప్లేయర్ టేలర్ టౌన్ సెండ్ 7-5, 6-1తో జెలెనా ఒస్టాపెంకోపై సునాయస విజయాన్నందుకొని మూడో రౌండ్‌కు ప్రవేశించింది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ విజేత అయిన ఒస్టాపెంకో.. టౌన్ సెండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో టౌన్‌సెండ్ వైపు వేలు చూపిస్తూ.. జాత్యహంకర వ్యాఖ్యలు చేసింది. 'నీకు ఒక స్థాయి లేదు.. సరైన చదువు లేదు'అని దూషించింది. ఈ విషయాన్ని టౌన్‌సెండ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

No Class No Education Ostapenko Accuses Townsend in US Open 2025 Row

అసలు గొడవ ఏంటంటే..?

అయితే ఈ గేమ్ రెండో సెట్‌లో నెట్ దగ్గర ఆడిన ఒస్టాపెంకో ఓ షాట్ కొట్టింది. ఆ తర్వాత టేలర్ టౌన్ సెండ్‌వైపు చూస్తూ నిలబడిపోయింది. ఈ చూపులపై టౌన్ సెండ్ అభ్యంతరం తెలిపింది. తన ఏకాగ్రతను దెబ్బతీసేలా ప్రయత్నించిందని ఆరోపిస్తూ టౌన్ సెండ్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. 'ఆమె అలా ఎందుకు చూస్తోంది? నాకు అగౌరవంగా ఉంది. మీరు ఆమెతో మాట్లాడాలి.'అని అంపైర్‌తో టౌన్ సెండ్ అనగా.. ఒస్టాపెంకో ఆగ్రహంగా బదులిచ్చింది. 'ఏం మాట్లాడుతున్నావు? నా వైపు చూడకు.'అని పేర్కొంది. మరింత ఆగ్రహానికి గురైన టౌన్‌సెండ్.. "నువ్వు అనాగరికంగా ప్రవర్తిస్తున్నావు"అని మండిపడింది. ఒస్టాపెంకో కూడా వెనక్కి తగ్గకుండా 'నువ్వు నన్ను చూసి నేర్చుకోవాలి'అంటూ ఘాటుగా బదులిచ్చింది. అంపైర్ జోక్యం చేసుకొని గొడవను ఆపే ప్రయత్నం చేసినా.. ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో ఇద్దరూ తిట్టుకున్నారు. ఇందుకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఎక్స్‌వేదికగా వివరణ..

ఈ సంఘటనపై ఇద్దరూ టెన్నిస్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా వేర్వేరుగా స్పందించారు. 'ఓటమిపాలైన తర్వాత ఎవరైనా నిరాశకు గురవుతారు. కానీ కొంతమంది హద్దులు మీరు ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒస్టాపెంకో కూడా నాతో అలానే ప్రవర్తించింది. నాకు క్లాస్, చదువు లేదని విమర్శించింది. అమెరికా బయట ఏం జరుగుతుందో వెళ్లి చూడమని హెచ్చరించింది.'అని మ్యాచ్ అనంతరం పేర్కొంది. దాంతో జెలెనాపై విమర్శలు రాగా.. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

'నా జీవితంలో నేను ఎప్పుడూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదు. అన్ని దేశాల ప్రజలను గౌరవిస్తాను. నాకు ప్రత్యర్థి దేశం ఏంటనేది అనవసరం. గెలుపే నా లక్ష్యం. మ్యాచ్ ఆరంభంలో అందరూ బేస్‌లైన్‌లో వార్మప్ చేయాలి. కానీ టౌన్‌సెండ్ మాత్రం బెస్‌లైన్‌లో కాకుండా బయటకు వచ్చి వార్మప్ చేసింది. టౌన్‌సెండ్ అలా చేయడం సరికాదు. అమె టెన్నిస్ నియమాలకు విరుద్దంగా ప్రవర్తించింది. కనీసం నెట్‌కార్డ్ విన్నర్‌కు సారీ కూడా చెప్పలేదు.'అని జెలానా తన పోస్ట్‌లో పేర్కొంది.

Story first published: Thursday, August 28, 2025, 14:04 [IST]
Other articles published on Aug 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+