For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naomi Osaka: ఆస్ట్రేలియా ఓపెన్ ముందు జపాన్ స్టార్ కీలకం నిర్ణయం..!

Naomi Osaka withdraws from Melbourne WTA tournament semifinal

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్, జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అనూహ్యంగా డబ్ల్యూటీఏ మెల్‌బోర్న్ టోర్నీ నుంచి తప్పుకుంది. అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఈ జపాన్ స్టార్.. పొత్తి కడుపు గాయంతో సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. దాంతో ఆమె ప్రత్యర్థి వెరోనికా సెమీఫైనల్ ఆడకుండానే ఫైనల్ చేరింది. ఇక తన నిష్క్రమణకు కారణాన్ని తెలియజేస్తూ ఒసాక ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఈ మెల్‌బోర్న్‌ టోర్నీ చాలా సరదాగా ఆడాను. దురదృష్టవశాత్తు పొత్తికడుపులో గాయం అవ్వడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సింది.

గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు సంసిద్దమయ్యేందుకు నాకు తగిన విశ్రాంతి అవసరం. ఆ క్రమంలోనే మెల్‌బోర్న్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను. సెమీఫైనల్లో తప్పుకోవాల్సి రావడం బాధగా ఉంది. సుదీర్ఘ విశ్రాంతి అనంతరం బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటంతో నా శరీరానికి షాక్ తగిలినట్లు అయింది. తగినంత విశ్రాంతి తీసుకొని అతి త్వరలోనే మీ ముందుకు వస్తా'అని ఒసాక పేర్కొంది. ఇక జనవరి 17 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది.

ఇక సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్‌లో ఒసాకా దారుణంగా విఫలమైంది. మూడో రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది. చెక్ రిప‌బ్లిక్ క్రీడాకారిణి మార్కెట వండ్రోసోవా చేతిలో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. దీంతో సొంత గడపై ఒలింపిక్ స్వర్ణం సాధించాలనే ఒసాకా కల నెరవేరకుండా పోయింది. ఇక గతేడాది ఆస్ట్రేలియ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఒసాకా అనంతరం మానిసక సమస్యలతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. మీడియా సమావేశానికి హాజరుకాకపోవడంపై మ్యాచ్ రిఫరీ ఆమెకు జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు అప్పట్లో పేర్కొంది.

Story first published: Saturday, January 8, 2022, 18:02 [IST]
Other articles published on Jan 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+