Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Naomi Osaka:పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన టెన్నిస్ స్టార్!

Naomi Osaka Announces Pregnancy, Plans Return In 2024

సిడ్నీ: జపాన్ టెన్నిస్టార్ నవోమి ఒసాకా తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైంది. కెరీర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్న ఈ జపాన్ స్టార్.. ఈ ఏడాది మొత్తం ఆటకు దూరంగా ఉంటానని చెప్పింది. తాను ప్రస్తుతం గర్భవతినని తెలిపిన ఒసాకా.. త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది.


'మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుుగుపెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా. కానీ నా జీవితానికి సంబంధించిన చిన్న అప్డేట్ మీతో పంచుకుంటున్నా. నేను భవిష్యత్‌లో ఆడాల్సిన ఆట చాలా మిగిలే ఉంది. ముఖ్యంగా నాకు పుట్టబోయే బిడ్డ నా మ్యాచ్‌లు చూడాలి. చూసి తన స్నేహితులతో ఆమె నా తల్లి అని చెప్పుకోవాలి.'అని పేర్కొంది. ప్రెగ్నన్సీకి సంబంధించిన స్కాన్ రిపోర్ట్‌లను కూడా షేర్ చేసింది. తల్లి కాబోతున్న ఒసాకాకు అభిమానులు, సహచర ఆటగాళ్లు విషెస్ తెలియజేస్తున్నారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఒసాకాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె ప్రముఖ అమెరికన్ ర్యాపర్, సింగర్ అయిన కోరేడ్ తో సహజీవనం చేస్తోంది. 2019 నుంచి ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఒసాకా కంటే కోరేడ్ ఓ ఏడాది చిన్నవాడు. ఈ ఇద్దరూ ఏడాది పాటు సీక్రెట్‌గా సహజీవనం చేశారు. 2020 చివర్లో వీరి రిలేషన్‌షిప్ బయటపడింది. అప్పట్నుంచి ఈ ఇద్దరూ బహిరంగంగానే చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాని ఈ జంట.. తమ రిలేషన్ గురించి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఒసాకా మాత్రం తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించింది. జీవితం చాలా చిన్నదని, ప్రతీది ఆస్వాదించాలని, ప్రతీ రోజు పునర్జన్మేనని ఒసాక తన పోస్ట్‌లో రాసుకురావడం గమనార్హం.

Story first published: Thursday, January 12, 2023, 18:46 [IST]
Other articles published on Jan 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+